తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామీ నుంచి ఇప్పటి వరకు దాదాపు అరడజను మంది హీరోలు వచ్చారు.  ఇక మెగాస్టార్ చిరంజీవి మాస్, క్లాస్ హీరోగా ఎంతో అభిమానుల అభిమానం సంపాదించారు.  అప్పట్లో టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా వెలిగిపోయిన చిరంజీవి పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వెళ్లారు.  తర్వాత ఆయన స్థానాన్ని కేవలం పవన్ కళ్యాన్ మాత్రమే భర్తీ చేశారనడంలో అతిశయోక్తి లేదు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత గొప్ప ఫాలోయింగ్ వచ్చిన హీరో పవన్ కళ్యాన్ ఒక్కడే.  
Image result for katama rayudu posters
అయితే గత కొంత కాలంగా చిరు ఫ్యామిలీతో పవన్ కళ్యాన్ కి తెడాలు వచ్చాయని అందుకే ఆయన మెగా ఫ్యామిలీ ఈవెంట్స్ కి హాజరు కాకపోవడం జరుగుతుందని వార్తలు వచ్చాయి.  అంతే కాదు ఆ మద్య నాగబాబు కూడా పవన్ ఫై అభిమానుల సాక్షింగా బాగా ఫైర్ అయ్యారు.  అయితే ఇదంతా అవాస్తవం అని పవన్ కళ్యాన్ చిరంజీవి షష్టిపూర్తి కార్యక్రామానికి వెళ్లారు..అంతే కాదు సర్ధార్ గబ్బర్ సింగ్ ఆడియే వేడుకకు అన్నయ్యను చీఫ్ గెస్ట్ గా పిలిచాడు.  
Image result for katama rayudu posters

అన్నయ్య ఇంటికి వెళ్లి రావడం..ఇలా మా అన్నదమ్ముల మద్య ఎలాంటి విభేదాలు లేవని చాటి చెప్పాడు.  తాజాగా బాబాయ్ పవన్ కళ్యాణ్ ‘కాటమ రాయుడు’ ట్రైలర్ నిన్న రిలీజ్ కావడంతో దానిపై స్పందించాడు. తన పేస్ బుక్ లో కాటమ రాయుడు ట్రైలర్ లింక్ పెట్టేసి '' మన అందరి కాటమ రాయుడు మార్చి 24 న థియేటర్ లలోకి వస్తున్నాడు ...... ట్రైలర్ పవర్ ప్యాక్డ్ సెలెబ్రేషన్ లా ఉంది అంటూ కామెంట్ చేసాడు చరణ్.
Image result for katama rayudu posters
కాటమ రాయుడు ప్రీ రిలీజ్ వేడుకలో మెగా కుటుంబం నుండి ఒక్క పవన్ తప్ప మరొక హీరో అంటూ ఎవరూ లేకపోవడంతో కొంత నిరాశ కు గురయ్యారు మెగా ఫ్యాన్స్ .  అయితే అదే సమయంలో చరణ్ బాబాయ్ సినిమా గురించి కామెంట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు . అన్నయ్య సంక్రాంతి రేసులో ఘనవిజయం సాధించగా తమ్ముడు వేసవి బరిలో ఉగాది కానుకగా వస్తున్నాడు . ఏది ఏమైనా ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ హీరోల హవా కొనసాగుతుందనడంలో అతిశయోక్తి లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: