తెలుగు, తమిళ, మళియాళ, కన్నడం ఇండస్ట్రీలో నటిగా మంచిపేరు తెచ్చుకున్న హీరోయిన్ పూర్ణ. తెలుగులో పలు హిట్ సినిమాల్లో నటించిన ఈమె స్వతహాగా మంచి డాన్సర్. అయితే చిన్నప్పటి నుంచి ఓ డాన్స్ స్కూల్ నెలకొల్పాలనేది ఆమె కోరిక. పూర్ణకి మొదటి నుంచి భరత నాట్యం అంటే ఎంతో మక్కువ. కేరళకు చెందిన ముస్లిం కుటుంబంలో జన్మించిన పూర్ణ కు భరతనాట్యం అంటే అమితమైన ఆసక్తి దాంతో సినిమాల్లోకి ప్రవేశించింది .
ఇక సినిమాల్లోకి వచ్చాక తన అసలు పేరు '' షామ్నా ఖాసీం '' పేరుతో కాకుండా పూర్ణ పేరుతో నటిస్తూ మంచి హిట్ కోసం ఎదురు చూస్తుంది. ఈ మద్య చాలా మంది సెలబ్రెటీలో సెల్ఫీ వీడియోలు తీసుకొని సోషల్ మీడియల్ పోస్ట్ చేస్తున్నారు. దీంతో వారికి లైక్స్ రావడమే కాకుండా మంచి క్రేజ్ కూడా వస్తుంది. తాజాగా పూర్ణ కూడా ఇదే పని చేసింది..కాకపోతే వెరైటీ గా ఈ వీడియోని పోస్ట్ చేసింది.
తనకు పిచ్చెక్కిందని..ఈరోజంతా నాకు మెంటల్ అంటూ ట్వీట్ చేసింది అంతేకాదు పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేస్తూ ఓ వీడియో ని కూడా పోస్ట్ చేసింది పూర్ణ . 2004 లో సినిమాల్లోకి వచ్చిన ఈ భామ ఇండస్ట్రీలో మంచి హిట్ కోసం ఎదురు చూస్తుంది.
పూర్ణ ట్విట్ :