తాజాగా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, తన మిత్రుడు…ప్రముఖ గాయకుడు బాలసుబ్రమణ్యంకి లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారం చిలికి చిలికి గాలి వాన అవుతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఒక్కసారిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సింగర్స్ కి వార్నింగ్ బెల్స్ ఇచ్చారు.


తన పాటలు పాడకూదంటూ కోర్ట్ నోటీసులను కూడా వారికి పంపారు. ముఖ్యంగా తన సొంత ట్యూన్స్ ఇతరులు కాపీ చేస్తుండటంతో ఇళయరాజా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు తన కంపొజిషన్స్ తన అనుమతి లేకుండా పాడకూడదని నోటీసులు పంపారు. ఇది సోషియల్ నెట్ వర్కింగ్ లో ట్రెండింగ్ గా మారింది. ఈ నోటీసులకి వెంటనే స్పంధించిన బాలసుబ్రమణ్యం..‘నాకు ఇళయారాజా వద్ద నుండి లీగల్ నోటీసులు అందాయి.


అందులో వివిధ దేశాల్లో శ్రీమతి చిత్ర, చరణ్ లు నిర్వహిస్తున్న కచేరీల్లో తన కంపొజిషన్స్ పాడకూడదని, ఆలా చేస్తే కాపీ రైట్స్ ని అతిక్రమించినందుకుగాను భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఎస్పీబీ50 పేరుతో మా అబ్బాయి ఈ టూర్ ప్లాన్ చేశారు. నేను ఇప్పటి వరకు రష్యా, మలేషియా, శ్రీలంక, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో ఎన్నో కచేరీలు చేశాను. అప్పుడు రాని నోటీసులు అమెరికాలో కచేరీ అనగానే వచ్చాయి. ఆయన చెప్పారు కాబట్టి యూఎస్ టూర్లో ఆయన పాటలను ఆలపించను. కానీ కచేరీ మాత్రం అనుకున్న ప్రకారమే జరుగుతుంది.


నేను నా మంచి మిత్రుడు ఇళయరాజాను ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటున్నాను’ అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు. అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సింగర్స్ పై ఈ మధ్య కాలంలో ఇళయరాజా కి కాస్త కోపం ఎక్కువుగానే ఉంది. ముఖ్యంగా బాలు తన పాటలను కచేరీలలో ఉపయోగించి కమర్షియల్ లాభాలను పొందుతున్నారని కొందరు ఇళయరాజాకి చెప్పుకొచ్చారు. దీంతో ఇళయరాజా ఒక్కసారిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సింగర్స్ కి తన కంటెంట్ రైట్స్ కి సంబంధించిన లీగల్ నోటీసులను పంపారు. దీంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఈ నోటీసులు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఏ సింగర్ కి అందకపోవటం ఆశ్ఛర్యంగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: