‘బాహుబలి 2’ మూవీ ప్రస్తుతం ఇండియన్ మూవీ కాదు…వరల్డ్ మూవీగా ట్రెండింగ్ అవుతుంది. ‘బాహుబలి 2’ మూవీ  కోసం ఇండియా మాత్రమే కాకుండా ఇత దేశాలకి సంబంధించిన ఫ్యాన్స్ సైతం ఎదురుచూస్తున్నారు. ఓవర్సీస్ లో‘బాహుబలి 2’ కి విపరీతమైన ఆధరణ ఉంది. ఎప్పుడూ హాలీవుడ్ మూవీల గురించే మాట్లాడుకునే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ…ఈసారి మాత్రం ఓ ఇండియన్ మూవీ గురించి హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాట్లాడుకోవటం సన్షేషన్ అయింది.


ఈ ఫీలింగ్ ఇండియన్ సినిమా లవర్స్ కి ఎంతో ప్రత్యేకంగా మారింది. ఇదిలా ఉంటే ఈ మార్చి నెల 16వ తారీఖున విడుదలైన ‘బాహుబలి 2’ ట్రైలర్…సృష్టించిన రికార్డ్స్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే పలు రికార్డుల్ని బద్దలు కొట్టిన ఈ ట్రైలర్ తాజాగా అన్ని భాషల్లో కలిపి 60 మిలియన్ వ్యూవ్స్ ని పొందింది. ఇది ప్రపంచస్థాయి రికార్డ్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గూగుల్ ట్రెండింగ్స్ లో కూడా ‘బాహుబలి 2’ టాప్ లో నిలిచింది.


దీంతో గూగుల్ ఇండియా ఈ న్యూస్ ని సరికొత్తగా ప్రెజెంట్ చేసి…‘బాహుబలి 2’ కి మరికాస్త ప్రమోషన్ ని క్రియేట్ చేసింది. బాహుబలితోపాటు ట్రెండ్ అయిన ఐన్ స్టీన్,హొలీ కలిపి ఒక వీడియోను తయారుచేసింది. అందులో బాహుబలి పాత్రకు ఐన్ స్టీన్ కాస్ట్యూమ్స్, కళ్ళజోడు తగిలించి పక్కనే ఐన్ స్టీన్ ఫార్ములాను కూడా ఉంచి ఒక జీనియస్ మైండ్ యుద్ధ వీరుడి గుండెతో కలిస్తే కలర్ ఫుల్ గా ఉంటుంది అంటూ హైలీ రంగుల్ని కూడా చల్లింది.


ఇలా గూగుల్ ఇండియా ఒక టైలర్ ట్రేండింగ్ ను ఇలా ప్రెజెంట్ చేయడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉంటే ఈ మూవీని హాలీవుడ్ స్టార్స్ కోసం యు.ఎస్ లో స్పెషల్ ప్రీమియర్ షోలను రిలీజ్ కి ముందు రోజు ప్రదర్శించనున్నారని అంటున్నారు. హాలీవుడ్ లో ‘బాహుబలి 2’ పై ఉన్న క్రేజ్ కారణంగా అక్కడి స్టార్స్ ఈ మూవీని చూడాలని భావిస్తున్నారట. అయితే దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: