బాలీవుడ్ లో ప్రస్తుతం ఖాన్ ల హవా నడుస్తుంది.  అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూ ఖాన్ ఈ ముగ్గురు టాప్ హీరోలుగా వెలిగిపోతున్నారు.  అయితే మిస్టర్ ఫర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ గత కొంత కాలంగా నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి.  ఈ మద్య రిలీజ్ అయిన ‘దంగల్’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.  ఇక ఇంటస్ట్రీలో టాప్ హీరోగా ఉన్న అమీర్ ఖాన్ ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు.
Image result for dangal movies stills
 గతంలో లగాన్ చిత్రంలో సామాన్య రైతుగా నటించిన అమీర్ దంగల్ చిత్రంలో నలుగురు పిల్లల తండ్రిగా నటించాడు.  చేసే ప్రతీ సినిమా రికార్డుల మోత మోగించేలా చేస్తున్నాడు అమీర్ . చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ రికార్డుల మోత మోగిస్తున్నాడు.  అమీర్ సినిమా ఇంతగా కలెక్షన్ల వర్షం కురిపించడానికి గల కారణం అయన విలక్షణ, వైవిధ్యమైన నటనే. ఇలాంటి విలక్షణ నటుడి సినిమా బాక్సాఫీస్ వద్ద కలక్షన్ల సునామీ సృష్టించడం సహజమే. ఈ హీరో నటించగా ఇటీవల సంచలన విజయం సాధించిన ‘దంగల్’ సినిమాతో ఆమిర్ ఏకంగా రూ.175 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట.
Image result for dangal movies posters
దంగల్ చిత్రంలో నటించినందుకు గాను  రెమ్యునరేషన్ కింద తీసుకున్నది 35 కోట్లు కాగా మిగతా సొమ్ము లాభాల్లో వాటాగా తీసుకున్నాడు . లాభాల్లో 33 పర్సెంట్ తన వాటాగా తీసుకుంటాడట అమీర్ దాంతో దంగల్ చిత్రంలో నటించినందుకు గాను మొత్తం మీద 175 కోట్లు వచ్చాయి అమీర్ వాటాకు . 
 బాలీవుడ్ చరిత్ర ని తిరగ రాసాడు.  అమీర్ ఖాన్ ఎక్కువ సంపాదించడమే కాదు టాక్స్ లు కూడా కడుతున్నాడు అమీర్ .


మరింత సమాచారం తెలుసుకోండి: