మెగా హీరోలలో ప్రతి మూవీకి కొత్తగా, విభిన్నంగా తన పద్దతిని మార్చుకుంటున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది కచ్ఛితంగా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ అని చెప్పవచ్చు. ప్రతి మూవీకి ఆడియో ఫంక్షన్ లో అల్లుఅర్జున్ మాట్లాడే తీరు మారుతూ వస్తుంది. అందరి హీరోల్లా కాకుండా చాలా హుందాగా తను, తన అభిమానుల గురించి…సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఈ విధంగా చేయటం ద్వారా ఫ్యాన్స్ సైతం అల్లుఅర్జున్ పద్దతికి ఇంప్రెస్ అవుతున్నారు.


ఇదిలా ఉంటే అల్లుఅర్జున్ మాత్రం తన ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాన్ పేరు బయటకు వస్తే కాస్త సీరియస్ గా కనిపిస్తారు. ఈ విషయాన్ని పలుసార్లు ఫ్యాన్స్ కి సైతం చెప్పారు. దీని కారణంగా పవన్ కళ్యాణ్ కి, అల్లుఅర్జున్ కి మధ్య ఏమైనా ఉందా? అనే నెగిటివ్ టాక్స్ బయటకు వెళుతున్నాయి.


అయితే బయటకు వచ్చిన టాక్స్ ఎలా ఉన్నప్పటికీ…మెగాఫ్యామిలీలో ఎటువంటి బేధాబిప్రాయాలు లేవని…అందరూ కలిసికట్టుగానే ఉన్నారనేది మెగాహీరోల నుండి వస్తున్న క్లారిటీ స్టేట్మెంట్. ఇదిలా ఉంటే తాజాగా ‘కాటమరాయుడు’ థియోట్రికల్ ట్రైలర్ పై అల్లుఅర్జున్ తన కామెంట్ న చెప్పాడు. ‘కాటమరాయుడు’ థియోట్రికల్ ట్రైలర్ పై అల్లుఅర్జున్ తన కామెంట్ ని చెప్పటం ఇది రెండో సారి. అందుకే ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ లా మారింది.


‘కాటమరాయుడు’ ట్రైలర్ సూపర్భ్ గా ఉంది. ఈసారి కచ్ఛితంగా మొదటి రోజే ఈ షోని చూస్తాను అని తాజాగా కామెంట్ చేశారు. తాజా కామెంట్ తో పవన్ కళ్యాణ్ పై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని అల్లుఅర్జున్ ఈ విధంగా చాటుకున్నాడని అంటున్నారు. ఇక అల్లుఅర్జున్ నటిస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ కి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరో టీజర్ బయటకు రానుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: