టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ విభిన్నమైన జర్నీని చేస్తున్న యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క సునీల్ మాత్రమే అని చెప్పవచ్చు. కమెడియన్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన సునీల్, తరువాత హీరోగా టర్న్ అయి పలు సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు. అయితే తను హీరోగా చేసిన‌త‌రువాత‌ కొన్ని సినిమాలు మాత్రమే తనకి సక్సెస్ ని ఇచ్చాయి.

కమర్షియల్ గా ఎక్కువ సినిమాలు హిట్ అయినప్పటికీ…ప్రేక్షకులకి మాత్రం కొద్దిసినిమాలే  గుర్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తనకి ఇతర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయాల్సిందిగా ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. అలాగే పెద్ద హీరోల మూవీల్లో కమెడియన్ గా చేయాలని పలు ఆఫర్స్ వచ్చాయి. కానీ సునీల్ మాత్రం తిరిగి కామెడీ పాత్రల జోలికి వెళ్ళకుండా సిన్సియర్ గా హీరో రోల్స్ కే పరిమితం అయ్యారు. తాజాగా ‘జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే’ వంటి చిత్రాలు పర్వాలేదనిపించినా ఆశించిన విజయం దక్కలేదు.

దీంతో సునీల్ ఈసారి కచ్చితమైన హిట్ అందుకోవాలని భావించారు. దర్శకుడు క్రాంతి మాధవన్ దర్శకత్వంలో ‘ఉంగరాల రాంబాబు’ అనే చిత్రం చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే హిట్ కోసం చూస్తున్న సునీల్ కి ఈ రెండు నెలలలో పలు మూవీల నుండి కామెడీ పాత్రలు చేయాలంటూ ఆఫర్స్ వచ్చాయి.

దాదాపు 10 చిత్రాలకి సంబంధించిన ఆఫర్స్ ని సునీల్ రిజెక్ట్ చేసినట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే సునీల్ మాత్రం తను హీరోగా చేస్తున్నప్పుడు మరో మూవీలో కామెడీ పాత్రలను చేయనని నిర్ణయించుకున్నారు. మొత్తంగా సునీల్ ప్రస్తుతం ఓ మంచి బ్రేక్ కోసం ట్రై చేస్తున్నాడనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇక ఉంగరాల రాంబాబు మూవీపై సునీల్ గట్టి నమ్మకాన్ని పెట్టుకున్నాడని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: