టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్ గా పేరుగాంచిన డైరెక్టర్ త్రివిక్రమ్. అలాంటి త్రివిక్రమ్ కే ఓ ఆర్టిస్ట్ ఝలక్ ఇవ్వటం ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ‘అరుంధతి’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషించిన సోనూ సూద్..ఓ కొత్త కెరీర్ ని ప్రారంభించాలనుకుంటున్నారు.

అరుంధతి చిత్రం సోనూ సూద్ కి మంచి బ్రేక్ ని ఇచ్చిందనే చెప్పాలి. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ మంచి నటన ప్రదర్శించి స్టైలిస్ట్ విలన్ పేరు తెచ్చుకున్నాడు. అలాగే త్రివిక్రమ్ తెరకెక్కించిన జులాయి మూవీలోనూ సోనూ సూద్ నటనకి మంచి గుర్తింపు వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మూవీ కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతుంది. ఈ మూవీలోనూ సోనూ సూద్ ని విలన్ గా తీసుకోవాలని త్రివిక్రమ్ భావించారు.

అయితే త్రివిక్రమ్ మూవీలో విలన్ గా నటించలేను అంటూ సోనూ సూద్ ఇచ్చిన ఆన్సర్ కి త్రివిక్రమ్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ మధ్య కాలంలో సోనూ సూద్ మూవీల లిస్ట్ ని చూస్తే…తను విలన్ గా నటించిన సినిమాల కంటే హీరోగా నటిస్తున్న సినిమాలే ఎక్కవుగా ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో సోనూ సూద్ సెకండ్ హీరోగా సినిమాలు వ‌స్తున్నాయి.  

తాజాగా సోనూ సూద్ తిరుమల దేవస్థానాన్ని దర్శించుకున్న తరువాత మీడియాతో మాట్లాడుతూ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్ లు నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తే చాలా సంతోషిస్తాను అంటూ తన కోరికని చెప్పుకున్నారు. దీంతో పవన్ కళ్యాన్ మూవీలో విలన్ గా ఆఫర్ వచ్చినప్పటికీ సోనూ సూద్ ఎందుకు నో చెప్పాడు అనేదానికి త్రివిక్రమ్ కు ఇప్పడు అర్ధం అయింది. సోనూ సూద్ హీరో అవ్వాలనే కోరిక త్రివిక్రమ్ కి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అందులోనూ సోనూ సూద్ ని హీరోగా తెలుగులో సినిమా చేస్తే మార్కెట్ ఎలా ఉంటుందనేది త్రివిక్రమ్ కి స్పష్టంగా తెలుసు. అందుకే సోనూ సూద్ జోలికి ఇప్పట్లో వెళ్ళకూడదనేది త్రివిక్రమ్ నిర్ణయంగా తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: