డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ ఈమధ్య కాస్త ఫాంలో లేడు కాని అసలు సిసలు టాలెంట్ భయటపెడితే మాత్రం అదరగొట్టడం ఖాయం. స్టార్స్ గా ఉన్న హీరోలను సూపర్ స్టార్స్ గా చేస్తూ సినిమాలను అందించిన పూరి జగన్నాధ్ ఇప్పుడు కెరియర్ లో కాస్త వెనుకపడ్డాడు. వరుస సినిమాలైతే చేస్తున్నాడు కాని హిట్ మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు పూరి.


టెంపర్ తర్వాత ఒక్క హిట్ అందుకోలేని పూరి ప్రస్తుతం రోగ్ తో రాబోతున్నాడు. ఇక మరో పక్క బాలయ్యతో సినిమా చేస్తున్న డైరక్టర్ చిరు కోసం ఆటోజాని కథ చెప్పిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ 150వ సినిమాకు గాను ఆటోజాని కథ చెప్పిన పూరి మొదటి సగం నచ్చినా సెకండ్ హాఫ్ విషయంలో నచ్చక కాదనేశాడు.


అయితే అదే కథతో పూరి రవితేజ హీరోగా పెట్టి సినిమా చేయాలని చూస్తున్నాడట. ప్రస్తుతం మాస్ మహరాజ్ రవితేజ కూడా ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇద్దరికి హిట్ కంపల్సరీ ఆ క్రమంలో చిరు కోసం అనుకున్న ఆటోజాని కథను రవితేజ కోసం మళ్లీ తెరమీదకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడట పూరి. ఇద్దరు కలిసి చేసిన సినిమాలు ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతే సినిమాలు మంచి ఫలితాలను అందుకున్నాయి.


ఇక తర్వాత వచ్చిన దేవుడు చేసిన మనుషులు ఫ్లాప్ గా మిగలగా రాబోతున్న ఆటోజాని కథ కూడా రవితేజకు సూపర్ హిట్ అందించాలని చూస్తున్నాడు. ఓ పక్క బాలయ్య సినిమా చేస్తున్న పూరి మాస్ మహరాజ్ ను ఆటోజాని చేసే ప్రయత్నంలో ఉన్నాడట. 



మరింత సమాచారం తెలుసుకోండి: