గత కొన్ని రోజుల నుంచి కోలీవుడ్ లో పెను సంచలనాలకు కేంద్ర బింధువుగా నిలిచింది పాప్ సింగర్ సుచిత్ర మానసిక పరిస్థితి బాగా లేదని ఆమె స్వయంగా ఆమె భర్త తెలిపారు. అయితే  ఇలాంటి ట్వీట్లపై రకరకాల వివరణ ఇచ్చింది సుచిత్ర. తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని ఒకసారి, కాదని ఒక సారి.. ట్వీట్ పెట్టింది. మరి వరసగా వివాదాస్పద ట్వీట్లు వస్తున్నాయి కదా..హ్యాక్ అయి ఉంటే, ఈ అకౌంట్ ను డిలీట్ చేసుకోవచ్చు కదా.. అని అడిగితే, ఆ అవసరం లేదని సుచిత్ర అంటోంది.
Image result
తనను నమ్మే వారు మాత్రమే తనతో ఉంటారు, నమ్మని వారు ఉండరని ఆమె తేల్చి చెబుతోంది స్టార్ హీరోలు, హీరోయిన్ల పర్సనల్ ఫొటోలు ఆమె ట్విట్టర్ నుండి షేర్ అయ్యాయి. ఇందులో టాలీవుడ్ కి చెందిన త్రిష, రానాలు కూడా ఉన్నారు. దీంతో  తమిళ సినీ ప్రముఖులతో పాటు తెలుగు సినీ వర్గాల్లోని పెద్దలు కూడా  ఎక్కడ తమ ఫొటోలు లీకవుతాయోనని తెగ టెక్షన్ పడిపోయారు.  అయితే వారం రోజులుగా సుచీలీక్స్‌కి బ్రేక్ ప‌డింది.
Image result
సింగ‌ర్ సుచిత్ర విదేశాలు వెళ్లిపోయింద‌ని ప్ర‌చారం సాగించినా, లేదు సుచీని కొంద‌రు కిడ్నాప్‌ చేశార‌న్న వార్త‌లు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. త‌మిళ ప‌రిశ్ర‌మ‌కు చెందిన కొంద‌రు పెద్ద‌లు సుచీని కిడ్నాప్ చేసి ఉంటార‌న్న వాదన వినిపిస్తోంది. కాస్త సైలెన్స్ గా ఉన్న సుచీలీక్స్ ప్రకంపనాలు  ఉన్న‌ట్టుండి మ‌ళ్లీ మొదలయ్యాయి.  ఈసారి బాత్రూమ్‌లో స్నాన‌మాచ‌రిస్తున్న ఓ న‌టి ఫోటోలు సుచీ ట్విట్ట‌ర్‌లో లైవ్ అయ్యాయి.
Image result for సుచిత్ర
త్రిష‌, ధ‌నుష్‌, హ‌న్సిక‌, చిన్మ‌యి, అనిరుధ్‌, ఆండ్రియా, అనుయా భ‌గ‌త్‌, సంచిత ప‌దుకొన్‌ల ప్రయివేటు ఫోటోల్ని, వీడియోల్ని సుచీలీక్స్ బ‌ట్ట‌బ‌య‌లు చేసి ప‌రువు బ‌జారుకీడ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ మంట‌తోనే కొంద‌రు గ్రూపుగా ఏర్ప‌డి సుచీని కిడ్నాప్ చేశార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.  తాజా కిడ్నాప్ వార్త‌ల నేప‌థ్యంలో ఏది నిజం? ఏది అబ‌ద్ధం పోలీసులే సుమోటోగా కేసును స్వీక‌రించి ద‌ర్యాప్తు చేస్తారేమో చూడాలి. ఈ విషయంపై సుచిత్ర భర్త స్పందిస్తే కానీ అసలు విషయాలు బయటకు రావు.



మరింత సమాచారం తెలుసుకోండి: