భారతీయ సినిమారంగం గర్వింపతగ్గ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ ‘బాహుబలి’ పై చేసిన సంచలన వ్యాఖ్యలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి మణిరత్నం దర్శకత్వంలో రెహమాన్ సంగీతాన్నందించిన ‘చెలియా’ ఆడియో వేడుక కోసం హైదరాబాద్ వచ్చిన రెహమాన్ ఈ కామెంట్స్ చేసాడు.  ఇదే సందర్భం లో రెహమాన్ మాట్లాడుతూ తెలుగు సినిమా ఎదుగుదలను చూస్తే తనకు గర్వంగా ఉంది అంటూ ‘బహుబలి’ ని  ఆకాశానికి ఎత్తేశాడు.
 
తన సినిమాలు తమిళం నుంచి తెలుగులోకి అనువాదమైనపుడు తెలుగు పాటలే బాగున్నాయని అందరూ కామెంట్ చేస్తున్నప్పుడు తెలుగు భాష తియ్యదనం తనకు అర్ధం అయింది అంటూ కామెంట్స్ చేసాడు రెహమాన్. ఒకప్పుడు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాలు ఒక్కటిగా ఉండేవి అన్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఇప్పుడు దక్షిణాది సినిమా రంగంలో వివిధ భాషలకు సంబంధించిన సినిమాల ఎదుగుదల తనను ఆశ్చర్య పరుస్తోంది అంటూ కామెంట్స్ చేసాడు.

తెలుగు సినిమా గత కొన్నేళ్లలో ఎదిగిన తీరు తనకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ప్రపంచం మొత్తం బాహుబలి లాంటి సినిమా వైపు చూసేలా దర్శకత్వం వహించిన రాజమౌళి లాంటి వ్యక్తులు తెలుగు వాళ్ళు కావడం తెలుగు జాతికి గర్వకారణం అంటూ రాజమౌళిని కూడ ఆకాశానికి ఎత్తేశాడు రెహమాన్. ఇదే సందర్భంలో ఈ మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ ఏడాదికి ‘బాహుబలి’ లాంటి సినిమాలు నాలుగు రావాలి అంటూ తన కోరికను వ్యక్త పరిచాడు.

అంతేకాదు తమిళం తెలుగు కన్నడ మళయాళ భాషల సినిమాలు ఒక త్రాటి పైకి వస్తే  ‘బాలీవుడ్’ లాంటి మాటలు ఇక వినిపించవు అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. కీరవాణి సినిమాల నుంచి రిటైర్ అయిన తరువాత రాజమౌళి రెహమాన్ చేత తన సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేయిస్తాడు అని గతంలో వార్తలు వచ్చిన నేపధ్యంలో రెహమాన్ ఈవిధంగా స్పందించాడనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: