బాలీవుడ్  ఇండస్ట్రీలో ఖల్ నాయక్ గా పేరు తెచ్చుకున్న హీరో సంజయ్ దత్.  ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటులు సునీల్ దత్, నర్గీస్ ల ముద్దుల తనయుడిగా సినీరంగ్ర ప్రవేశం చేసిన సంజయ్ దత్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో అక్రమ ఆయుధాలు కలిగిఉన్నాడన్న కేసులో జైలు శిక్ష అనుభవించాడు.  గత సంవత్సరం జైలు శిక్ష పూర్తి చేసుకొని స్వేచ్చా జీవితం గడుపుతున్నారు. ప్రస్తుతం సంజయ్ దత్ ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'భూమి' సినిమాలో నటిస్తున్నారు.  
Image result for sanjay dutt family
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరుగుతోంది. యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా సంజయ్ దత్ గాయపడ్డాడు.  కానీ సంజయ్ దత్ మాత్రం షూటింగ్ ఆపకుండా పెయిన్ కిల్లర్ వేసుకొని షూటింగ్ పూర్తి చేశాడట. దీంతో నొప్పి తీవ్రం కావడంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోగా, పక్కటెముక విరిగినట్టు తేలింది.
Image result for sanjay dutt family
దీంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో, షూటింగ్ కు విశ్రాంతినిచ్చారు. ఆయనకు గాయం పూర్తిగా నయం అయిన తర్వాత తిరిగి షూటింగ్ లో పాల్గొంటారని సన్నిహితులు తెలిపారు.  సంజయ్ దత్ పూర్తిగా కోలుకోవాలంటే కనీసం రెండు నెలలైనా పట్టొచ్చని ఆ తర్వాత షూటింగ్‌లో పాల్గొంటాడని యూనిట్ వర్గాలు తెలిపాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: