సినిమా ఇండస్ట్రీలో మణిరత్నం అంటే ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.  ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో, హీరోయిన్ మణిరత్నం దర్శకత్వంలో ఒక్కసారి నటిస్తే చాలు అనుకునే స్థాయి..అలాంటి మణిరత్నం మరోసారి తనదైన స్ట‌యిల్లో ఉండే ఇన్‌టెన్స్ ల‌వ్‌స్టోరీ తెరపైకి తీసుకు వస్తున్నారు.  కార్తీ, అదితిరావ్ హైద‌రీ జంట‌గా న‌టించిన ‘చెలియా’ చిత్రానికి సంబంధించి సినిమా పాట‌ల విడుద‌ల కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

 The audio release of Mani Ratnam’s ‘Cheliya’ was launched by producer Dil Raju. The movie stars Karthi and Aditi Rao Hydari in the lead roles. The movie will simlutaneoulsy release in Tamil as ‘Kaatru Veliyidai’ on April 7.

ఈ కార్య‌క్ర‌మంలో మ‌ణిర‌త్నం, ఎ.ఆర్‌.రెహ‌మాన్‌, సీతారామ‌శాస్త్రి, వంశీపైడిప‌ల్లి, సుహాసిని, కార్తీ, అదితిరావ్ హైద‌రీ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఆడియో సీడీల‌ను సీతారామ‌శాస్త్రి విడుద‌ల చేసి తొలి సీడీని ఎ.ఆర్‌.రెహ‌మాన్‌కు అంద‌జేశారు. గ‌త ఏడాది మ‌ణిరత్నం ఓకే బంగారం సినిమాను కూడా దిల్‌రాజు తెలుగులో విడుద‌ల చేసి హిట్ కొట్టారు. ఇప్పుడు ఈ చెలియా సినిమాను దిల్‌రాజు ఏప్రిల్ 7న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్నారు. 

Image result for cheliyaa audio release hyderabad

ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ మాట్లాడుతూ .. ``మ‌ణిరత్నంగారు నా బ్ర‌ద‌ర్‌, స్నేహితుడు. మా ఇద్ద‌రిదీ 25 యేళ్ళ జ‌ర్నీ. తెలుగు పాట‌లంటే నాకు చాలా ఇష్టం. భాష‌లోని గొప్ప‌త‌న‌మే అందుకు కార‌ణ‌మేమోన‌నిపిస్తుంది. ఇక బాహుబ‌లితో తెలుగు సినిమా స్థాయి ప్ర‌పంచస్థాయికి చేరుకుంది`` అన్నారు. 

Related image

కార్తీ మాట్లాడుతూ ``నేను ఏ స్కూల్‌లో అయితే సినిమా గురించి తెలుసుకున్నానో అదే స్కూల్‌లో యాక్టింగ్ గురించి తెలుసుకోవ‌డంతో చెలియా నాకు స్పెష‌ల్ మూవీ అని చెప్పాలి. ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్ట‌ర్ నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. ముందు క‌థ విన‌గానే అన్న‌య్య సూర్య లాంటివాడు చేయాల్సిన క్యారెక్ట‌ర్ అని కూడా మ‌ణిరత్నంగారికి చెప్పాను.  రెండు స్ట్రాంగ్ క్యారెక్ట‌ర్స్ మ‌ధ్య జ‌రిగే క‌థ‌. నాలాగే ఆడియెన్స్‌కు కూడా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. రెహ‌మాన్‌గారి మ్యూజిక్ విన్న‌ప్పుడ‌ల్లా ఓ ఎన‌ర్జి వ‌స్తుంటుంది. ఆ మ్యూజిక్‌లో నేను యాక్ట్ చేయ‌డం హ్య‌పీగా ఉంది. 

The audio release of Mani Ratnam’s ‘Cheliya’ was launched by producer Dil Raju. The movie stars Karthi and Aditi Rao Hydari in the lead roles. The movie will simlutaneoulsy release in Tamil as ‘Kaatru Veliyidai’ on April 7.

అదితి మాట్లాడుతూ - ``ఇది నాకొక స్పెష‌ల్ మూవీ. క‌ల నేర‌వేరిన‌ట్టుగా అనిపిస్తుంది. నా స్వ‌స్థ‌ల‌మైన హైద‌రాబాద్‌కు రావ‌డం ఎంతో సంతోషానిస్తుంది. చెలియా నా తొలి తెలుగు సినిమా. మ‌ణిర‌త్నంగారు, ఎ.ఆర్‌.రెహ‌మాన్‌గారితో వ‌ర్క్ చేయ‌డం మ‌ర‌చిపోలేని అనుభూతి. కార్తీ నా ఫేవ‌రెట్ కో స్టార్‌. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు. 


కార్య‌క్ర‌మంలో పాల్గొన్నవారు దిల్‌రాజు స‌తీమ‌ణి శ్రీమ‌తి అనిత మృతికి సంతాపాన్ని తెలియజేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: