తెలుగు, మళియాల ఇండస్ట్రీలో వరుసగా విజయాలు సాధిస్తూ..యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్న మళియాల సూపర్ స్టార్ మోహనల్ మరో అద్భుతమైన చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  ‘1971 భారత సరిహద్దు’  చిత్రం ఆ నాటి భారత్ - పాకిస్థాల మద్య యుద్దం గురించి తెలిపే చిత్రం. మేజర్ రవి తెరకెక్కించిన ఈ చిత్రంలో అల్లు శిరీష్ కీలక పాత్ర పోషించాడు. 1970కి ముందు ఇండియా బార్డ‌ర్‌లో ఏం జ‌రిగింది? అన్న ఆస‌క్తిక‌ర క‌థాంశంతో ఈ మూవీ రూపొందగా ఇందులో శిరీష్ ఓ యుద్ధ సైనికుడిగా కనిపించనున్నాడు.  

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు శిరీష్ ఇప్పటి వరకు మూడు చిత్రాల్లో నటించిన పెద్దగా పేరు తీసుకు రాలేక పోయాయి.  కానీ మనోడు మళియాలంలో మాత్రం ఈ సినిమాతో మంచి మార్కులే కొట్టేశాడు.  కొత్త‌జంట‌, శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు వంటి హిట్ చిత్రాల తర్వాత శిరీష్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్ 1971 బియాండ్ బోర్డర్స్. తెలుగులో ఈ చిత్రం ‘1971 భారత సరిహద్దు’ అనే టైటిల్ తో విడుదల కానుంది.  
1971 Bharatha Sarihaddu Movie Teaser
గత సంవత్సరం క్రిష్ తెరకెక్కించిన ‘కంచె’ చిత్రం 1947 నాటి యుద్ద సన్నివేశాలకు సంబంధించి అద్భుతంగా చిత్రీకరించారు.  ఇక 1971 చిత్రం కూడా ఆనాటి యుద్ద సన్నివేశాలకు సంబంధించి ఆర్ట్ వర్క్ అద్భుతంగా తెరకెక్కించారు.   యుద్ద రంగంలో మోహన్ లాల్, అల్లు శిరీష్ చేస్తున్న విన్యాసాలు ఆడియన్స్ ని ఎంతో థ్రిల్ కి గురి చేస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో హిందీ నటుడు అరుణోదయ్ సింగ్, రెంజీ పనీకర్ మరియు సుధీర్ కర్మణ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.  సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ దుమ్మురేపుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: