టాలీవుడ్ క్రేజీ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిందని ఫిల్మ్ నగర్ టాక్. టాలీవుడ్ కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ దక్కించుకున్న ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా సినిమా చేసినా అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఇక సౌత్ లో కూడా కెరియర్ అయిపోయింది అనుకున్న టైంలో మళ్లీ ఊపందుకుంది.


ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో నటిస్తున్న అమ్మడికి ఇప్పుడు లక్కీగా బాలీవుడ్ ఆఫర్ కూడా వచ్చిందట. తెలుగులో సూపర్ హిట్ అయిన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ టెంపర్ మూవీ హిందిలో రీమేక్ చేయాలని చూస్తున్నాడు రోహిత్ శెట్టి. ఈ సినిమాలో హీరోగా రణ్ వీర్ సింగ్ ను ఫైనల్ చేశారట. ఇక తెలుగులో సినిమాలో హీరోయిన్ గా నటించిన కాజల్ నే అక్కడ హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.


తను చేసిన అన్ని సినిమాల్లో టెంపర్ లో కాజల్ కాస్త కొత్తగా కనిపించింది. స్టార్ సినిమా రీమేక్ హీరోయిన్ గా ఒకే హీరోయిన్ ను ప్రిఫర్ చేయడం గొప్ప విషయమే. ఇక మరో పక్క ప్రస్తుతం తెలుగు మార్కెట్ హింది సినిమాల మీద కూడా ప్రభావితం చూపిస్తున్నాయి. అందుకే సౌత్ హీరోయిన్ ను తీసుకుని సినిమా చేస్తున్నారు.


పూరి డైరక్షన్ లో వచ్చిన టెంపర్ అసలైతే పూరినే అభిషేక్ బచ్చన్ హీరోగా చేయాలని చూశాడు. కాని ఎందుకో అది కుదరలేదు. ఇక ప్రస్తుతం రోహిత్ శెట్టి రణ్ వీర్ సింగ్ తో సినిమా చేస్తున్నాడు. మరి తెలుగు టెంపర్ హింది రీమేక్ లో కూడా ఛాన్స్ దక్కించుకున్న కాజల్ ఈ అవకాశాన్ని అన్నివిధాలుగా వాడుకోవాలని చూస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: