Image result for IPRS between balu ilayaraja


ఇళయరాజా - యస్.పి.బాలసుబ్రహ్మణ్యం వివాదం ముదిరి పాకాన బడింది. అయితే ఈ ఎపిసోడ్ సర్వత్రా చర్చనీయాంశ మైంది. అయితే వీరి నాలుగు దశాబ్ధాల స్నేహం ప్రక్కనబెట్టి చట్ట పరంగా విశ్లేషిస్తే: 


చట్టపరంగా ఇళయరాజా నోటీసు బాలూకు పంపటం సమంజసమే. అయితే ఆ నోటీసు రాజా ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు ఇవ్వడమే విచిత్రం. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి ఐపీఆర్‌ఎస్‌ (ఇండియన్ పర్ఫామింగ్ రైట్ సొసైటీ) నిబంధనలు తెలియవా? అందరిలో ఉదయించే ప్రశ్న. ప్రజా వేదికలపై సంగీత విభావరి నిర్వహించి నప్పుడు టెలిజన్ రేడియోల ద్వారా ఇంతెందుకు సాధారణ వాణిజ్య పద్దతుల్లో ఒకరు లేదా కొందరు కలసి సృష్టించిన ప్రత్యేక నైపుణ్య పూరిత సంగీతాన్ని ఆలపించినా వినిపించినా అవి తప్పని సరిగా పేటెంట్ నిబందలను అనుసరించాల్సిందే. ఉదాహరణకు వాటిపై వచ్చే రాయల్టీస్ ను వారికి పంచాల్సిందే. ఒక హోటెల్ లో మంద్రం గా సంగీతం వినిపించినా ప్రభుత్వానికి కూడా  "టారిఫ్ పే" చేయాల్సిందే. ప్రభుత్వానికి సంగీత బాగస్వాములకు ఇది ఒక పెద్ద ఆదాయవనరులు.


Image result for IPRS between balu ilayaraja


రాయల్టీ కోరే హక్కు గాయకులు, రచయితలు, స్వరకర్తలు, నిర్మాతలు, చిత్రకారులు మొదలైన అందరికీ ఉంది. టికెట్లు వసూలు చేసి నిర్వహించే కార్యక్రమాల నిర్వాహకు లు రాయల్టీ చెల్లించాలి. దీని కోసమే  గా 1969లో ది "ఇండియన్‌ పెర్‌ ఫార్మెన్స్‌ రైట్స్‌ సొసైటీ" (ఐపీఆర్‌ఎస్‌) ఏర్పడింది. దీని నిబంధనల ప్రకారం టికెట్‌ వసూలుచేసే ప్రోగ్రామ్స్‌లో (వాణిజ్య ప్రయోజనాలకు) ఎవరి పాటలైనా పాడితే, విభావరి ఏర్పాటుచేస్తే అందులోని భాగస్వాములకు రాయల్టీ చెల్లించాలి. ఎవరైనా అభ్యంతరపెడితే వారి పాటలు పాడకూడదు. ఇది ఒక ప్రైవేటు రిజిస్టర్డ్‌ సంస్థ అనుసంధాన వారది. దీని నిబంధనలకు అందరూ కట్టుబడాలి. గతంలో ఆల్‌-ఇండియా రేడియో, దూరదర్శన్‌ లలో ప్రోగ్రామ్స్‌కు రాయల్టీలు ఇచ్చేవారు. లతా మంగేష్కర్‌ తన పాటలకు రాయల్టీ కోరారు. మహమ్మద్ రఫీ కోరలేదు. 


Image result for IPRS between balu ilayaraja


ఇక్కడ సమస్య ఇద్దరు అత్యంత సన్నిహితులైన సమర్ధులైన స్నేహితులు. వ్యక్తిగతంగా, వృత్తిగతంగానూ. తిరుపతి వేంకట కవుల్లా, బాపు-రమణల్లా వీరి సంగీత కార్యక్రమాల్లో విడదీయరాని,  విడదీయలేని జంట సంగీత కారులు. ఒకరిది గాత్రం మరొ కరిది సంగీతం. ఒకరు లేక మరొకరు రాణించలేరు. వేలల్లో సినిమా పాటలందించిన ఘనత వీరిది. వరసబెట్టి ఏ పాటలు పాడా రో రాస్తే వందల పేజీలు చాలవు. 



చట్టప్రకారం ఇళయరాజాకు నోటీసు ఇచ్చే అధికారం ఉంది. కానీ బాలు అమెరికాలో  పాడే సమయంలోనే ఇళయరాజా ఎందు కు నోటీసు ఇచ్చారో? ఎవరికీ అర్థం కాని విషయం.  50 ఏళ్లకుపైగా పాటలు పాడుతున్న బాలసుబ్రహ్మణ్యానికి "ఐపీఆర్‌ఎస్‌" గురించి తెలియదనటం కొంత విస్మయం  కలుగుతుంది. చారిటీతో పాటలు పాడినా, డబ్బులు తీసుకుని కచేరీలు చేసినా ఆ నిర్వాహకులు విభావరి నిర్వహించినప్పుడు రాయల్టీ తప్పని సరిగా చెల్లించాల్సిందే. వినోదమేదీ ఉచితం కాదు. ఇక్కడ ధనం సమస్య, రాబడి సమస్య, పంపకాల సమస్య ఉండి ఉండవచ్చు. "ధనం ఇదం మూలం జగత్" అన్నారు. వాణిజ్యావసరాల్లో మైత్రి అప్రస్తుతం.


Image result for balu ilayaraja



ఇందులో ఇళయరాజా చట్టపరంగానే ప్రవర్తించారు. ప్రజాభిమాన్ని కొండంతలుగా కలిగి ఉన్న వీరు వ్యక్తిగతంగా చర్చించుకొని సమస్యలకు చరమగీతం పాడి ఉంటే సంగీతా భిమానులకు ఇంత వ్యధ ఉండేది కాదు. ఇదెలా ముగుస్తుందో? వీరి గీతాలు లేకుండా వినకుండా ఉండటం దాదాపు అసాధ్యమే. 


ఇళయరాజా కంపోజ్ చేసిన ప్రతి పాట మధురం, కలకండ కంటే తియ్యగా ఉంటుంది. అదే బాలూ పాడితే మధురాతి మధురం అమృతంలాగా అనిర్వచనీయంగా మధురాతి మధురంగా ఉంటుందన్నదాంట్లో సందేహం అవసరం లేదు.  కానీ, టికెట్టు పెట్టి పాడే వేదికల మీద తన పాటలు అనుమతి లేకుండా పాడేందుకు వీలులేదని ఇళయరాజా బాలూకి నోటీసులు పంపడతో  "తియ్యనైన ఈ వ్యవహారం చేదు" గా మారింది. 


Image result for balu ilayaraja

మరింత సమాచారం తెలుసుకోండి: