మరో రెండు రోజులలో విడుదల కాబోతున్న ‘కాటమరాయుడు’ మూవీ 100 కోట్ల కలక్షన్ క్లబ్ లో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలను అదేవిధంగా ఈమూవీ మొదటి మూడు రోజులలోనే అత్యధిక కలక్షన్స్ ను రాబట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ నిన్న అఖిల భారత సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం చేసిన ఆరోపణలు ప్రస్తుతం మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. పవన్ ‘కాటమరాయుడు’ చిత్రానికి ఉన్న క్రేజ్ ను  ‘క్యాష్’ చేసుకుంటూ ఈ మూవీ మొదటి మూడు రోజుల్లో 30 కోట్లు సంపాదించాలన్న లక్ష్యాలతో, కేవలం పది రూపాయల టికెట్ ను 50 రూపాయలు చేసి సామాన్యుడికి వినోద భారాన్ని మోపుతున్నారని ఈ సంఘం నిర్వాహకులు నిన్న ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి తీవ్ర ఆరోపణలు చేసారు. 

అదేవిధంగా 50 టికెట్ ను 200గా - 150 టికెట్ ను 500కు పెంచి లూటీకి పాల్పడుతున్నారని ఈ టికెట్ల పెంపుపై కోర్టును ఆశ్రయించామని ఈ సంఘ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు  బెనిఫిట్ షోల పేరు చెప్పి ఒక్కో టికెట్ ను 5 వేల వరకూ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని వీరి వాదన. 

‘కాటమరాయుడు’ డిస్ట్రిబ్యూటర్స్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వాల మద్దతు కూడ ఉంది అని ఆరోపిస్తూ ‘కాటమరాయుడు’ సినిమాను మొదటి రెండు వారాలు బహిష్కరించవలసిందిగా అఖిల భారత సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం పిలుపును ఇచ్చింది. అంతేకాదు ఒకవేళ ఎవరైనా ‘కాటమరాయుడు’ సినిమాను ఇంత భారీ టిక్కెట్ ధరకు కొని చూసినా ఆ టిక్కెట్ ను ఆసినిమాను చూసిన ప్రేక్షకుడు జాగ్రత్త పెట్టుకుంటే ఈసినిమా నిర్మాతల పై కేసువేసి ఆ అధిక టిక్కెట్ డబ్బులు రాబడతాము అంటూ ఈ సంఘ నిర్వాహకులు నిర్వహించిన మీడియా సమావేశం హాట్ టాపిక్ గా మారింది. 

గతంలో ‘బాహుబలి’ విడుదల అయినప్పుడు ఆసినిమాకు ఏర్పడ్డ మ్యానియా పై ఇలాంటి ఆరోపణలను చేసారు ఈ సంఘ నిర్వాహకులు. అయితే టాప్ హీరోల సినిమాలను మొదటి రోజు చూసి తీరాలి అని ఉరకలు వేసే యూత్ కు అదేవిధంగా టాప్ హీరోల వీరాభిమానులకు ఈ సంఘం చేసే సూచనలు మైండ్ కు ఎక్కే ఆస్కారం లేదు. అయితే బయ్యర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకసారి ఒక టాప్ హీరో సినిమాకు నెగిటివ్ టాక్ మొదలైతే ఆ సినిమాను రక్షించడం ఎవరి సాధ్యం కాదని గతంలో విడుదలైన అనేక భారీ సినిమాల రిజల్స్ మనకు గుర్తుకు చేస్తాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: