సరిగ్గా ఎల్లుండి ఈ పాటికి థియేటర్ లలో దిగిపోతాడు కాటమరాయుడు .. పవన్ ఫాన్స్ తో పాటు ట్రేడ్ విశ్లేషకులు కూడా ఈ సినిమా మీద ఒక కన్నేశారు. తమిళ చిత్రం వీరం కి రీమేక్ గా రాబోతున్న ఈ చిత్రంతో పవన్ ఒక కొత్త చరిత్ర సృష్టిస్తాడా అని చాలా మంది ఆశ పడుతున్నారు. ఇప్పటికే కాటమరాయుడు ఖాతా లో ఒక అరుదైన రికార్డు నమోదు అయ్యింది. వీరం సినిమా రీమేక్ లు కొని ఈ సినిమాని తెలుగులో తీయడానికి శరత్ మరార్ కి దాదాపు ముప్పై కోట్లు ఖర్చు అయ్యిందట.


అయితే హక్కుల విషయం లో చూసుకుంటే థియేట్రికల్ రైట్స్ శాటిలైట్.. డబ్బింగ్ - ఆడియో-వీడియో - డిజిటల్ రైట్స్ రూపంలో ఇప్పటివరకూ మొత్తం రూ. 115 కోట్లు సమకూరాయని అంటున్నారు. ఒక రీమేక్ సినిమా అయినా కూడా పవన్ దెబ్బకి దాదాపు ఎనభై ఐదు కోట్ల సొమ్ము ప్రాఫిట్ గా వచ్చేసింది. టాలీవుడ్ లో విడుదల కి ముందరే ఇంత రేంజ్ లో ప్రాఫిట్ అందుకున్న సినిమా బాహుబలి తరవాత ఇదే. పవన్ కి అరవై శాతం వాటా రావాలి అనేది కమిట్మెంట్ అంటున్నారు. యాభై కోట్ల మేర పవన్ కి పారితోషికం అందే ఛాన్స్ ఉంది.


మొన్నటి వరకూ పాతిక కోట్లు తీసుకుని సినిమా తీసిన పవన్ సర్దార్ విషయం లో స్వయంగా ఇన్వెస్ట్ చేసాడు. తన రెమ్యునరేషన్ మొత్తం సినిమాలో పెట్టిన పవన్ దానికి ప్రాఫిట్ లు తీసుకోవాలి అనుకున్నాడు. అయితే ఆ సినిమా పల్టీ కొట్టింది. ఈ సారి ప్రొడక్షన్ లో వేలు పెట్టకుండా ఇలా డీల్ సెట్ చేసుకున్నాడు. ఏదేమైనా ఒక రీమేక్ సినిమా కి జనం ఇంతగ ఎగబడ్డం ప్యూర్ పవన్ స్టామినా అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.


డాలీ డైరెక్షన్ లో వచ్చిన గోపాల గోపాల పవన్ కి పెద్ద హిట్ ఇవ్వకపోయినా, అనూప్ రుబెన్స్ పాటలు ఎవ్వరికీ నచ్చకపోయినా , ట్రైలర్ కట్ కూడా పెద్ద గొప్పగా లేకపోయినా పవన్ దెబ్బతో ప్రొడ్యూసర్ కి ఎనభై ఐదు కోట్ల లాభం వచ్చేసింది అంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కాటమరాయుడు ఇంకెన్ని వండర్ లు చెయ్యడానికి సిద్దంగా ఉన్నడో .. మరి

 


మరింత సమాచారం తెలుసుకోండి: