తెలుగు ఇండస్ట్రీలో ‘హ్యాపీ డేస్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో నిఖిల్.  తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోయినా..స్వామిరారా చిత్రంతో మనోడి స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది.   ఇండస్ట్రీలో వైవిధ్యభరిత చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదించాడు నిఖిల్. కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ లాంటి సినిమాలతో మంచి విజయాలు సాధించి ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.  

ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న ‘కేశవ’ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది.  ఈ ట్రైలర్ లో రివేంజ్ స్టోరీ గా కనిపిస్తుంది.  నిఖిల్ చాలా వైలెంట్ గా కనిపిస్తున్నాడు. నిఖిల్ - రీతూ వర్మ జంటగా నటించిన కేశవ చిత్రానికి స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా అభిషేక్ నామా నిర్మించారు .

నిఖిల్ చిత్రాలు అన్ని కూడా విభిన్న నేపథ్యంలో రూపొందుతున్న విషయం తెలిసిందే . పైగా అతడి నుండి వస్తున్న చిత్రాలన్నీ కూడా హిట్ అవుతుండటం తో కేశవ పై అంచనాలు పెరిగాయి . ఇక ట్రైలర్ వల్ల సినిమా విజయం పై మరింత నమ్మకం ఏర్పడింది . మే 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: