తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్.   మొదట్లో పవన్ సినిమాలు పెద్దగా విజయాలు సాధించకున్నా ఖుషి, తమ్ముడు, జల్సా చిత్రాల తర్వాత ఒక్కసారే దూకుడు పెంచాడు.  ఇక గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత తెలుగు ఇండస్ట్రీలో పవన్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు..ఒక్కసారే మాస్ ఇమేజ్ కూడా పెంచుకున్నాడు.  తర్వాత రాజకీయ పార్టీ స్థాపించి ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు.  గత సంవత్సరం ‘సర్ధార్ గబ్బర్ సింగ్ ’ చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాన్ భారీ డిజాస్టర్ మూటగట్టుకున్నాడు.  
Image result for katamarayudu movie
వాస్తవానికి ఈ చిత్రం రిలీజు కి రెండు నెలల ముందు తెలుగ, హిందీ ఇండస్ట్రీలో భారీగా ప్రమోషన్ వర్క్ చేశారు.  దీంతో సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి..ఇక ఉగాది రోజున రిలీజ్ అయిన ఈ చిత్రంపై మొదటి రోజే పెదవి విరిచారు ప్రేక్షకులు.  దీంతో సినిమాలపై వైరాగ్యం పెంచుకున్నాడు పవన్..కానీ తనకు డబ్బు కావాలని సినిమాలు చేస్తేనే డబ్బు వస్తుందని అందుకోసమే సినిమాలు చేస్తున్నానని స్టేట్ మెంట్ ఇచ్చాడు.  సర్ధార్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాన్ ‘గోపాల గోపాల’ దర్శకుడు డాలీతో ‘కాటమరాయుడు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  
Image result for katamarayudu movie
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మీడియా కి చాలా చాలా దూరం అనట్టు ఉండేవాడు. అతని సినిమా అంటే ఒక ఇంటర్వ్యూ ఉండదు , ప్రమోషన్ ఉండదూ , కనీసం ప్రెస్ మీట్ , 100 డేస్ ఫంక్షన్ ఉండదు ఇలా ఏదీ లేకుండా కథ మొత్తం నడిపించేవాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తోనే పవన్ భారీ ఎత్తున  ప్రమోషన్ వర్క్ చేశారు.  నేషనల్ మీడియాలో ఇంటర్వ్యూలు దంచి కొట్టాడు..కానీ  సర్దార్ కి అవేమీ వర్క్ అవ్వలేదు అనుకున్నాడో ఏమో కాటమరాయుడు సినిమా కోసం మినిమం ప్రమోషన్ లకి కూడా పవన్ ఆసక్తి చూపడం లేదు.
Image result for katamarayudu movie
ఇక కాటమరాయుడు  సినిమా ఎల్లుండే వస్తోంది, సో కనీసం శనివారం , ఆదివారం టీవీ లలో ఇంటర్నెట్ లో పవన్ ఇంటర్వ్యూ వైరల్ అయితే సినిమాకి ఫెచ్చింగ్ అవుతుంది.ఈ సినిమాకు ఇప్పటికే కావాల్సినంత హైప్ రావడంతో ఇక వేరే ప్రమోషన్లేవీ అవసరం లేదని అనుకున్నారో ఏమో. లేక సినిమా రిజల్ట్ మీద నమ్మకం లేని పవన్ ప్రమోషన్ కి దూరం గా ఉన్నాడా ? అన్న అనుమానం వస్తుంది. ఏది ఏమైనా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: