ఖైదీ నెంబర్ 150’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బుల్లితెర పై మరో సంచలనం చేద్దామని ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంతో ప్రయత్నాలు చేసిన చిరంజీవికి ఆ కార్యక్రమ విషయంలో ఘోరమైన ఎదురు దెబ్బలు తగిలిన విషయం తెలిసిందే. దీనితో ఈకార్యక్రమానికి సంబంధించిన 40 ఎపిసోడ్స్ కాంట్రాక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుందా అని చిరంజీవి ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పుడు చిరంజీవి దృష్టి అంతా వచ్చేనెల నుంచి ప్రారంభం కాబోతున్న ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ మూవీ పై ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన ఈసినిమాకు సంబంధించి చిరంజీవి లుక్ ఎలా ఉండాలి అన్న చర్చలు ప్రస్తుతం మెగా కాంపౌండ్ లో జరుగుతున్నట్లు టాక్.  

తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ఎలా ఉంటారనే విషయం పై తెలుగు రాష్ట్రాల్లో కొంతమందికి అవగాహన ఉంది. సిపాయిల తిరుగుబాటు కంటే ముందే విప్లవ జెండాను ఎగరవేసిన ‘ఉయ్యాలవాడ’ ఒక పాలెగాడు కావడంతో భారీ కాయంతో కనిపిస్తాడు. అందువల్ల కండలు తిరిగిన శరీరంతో ఆజానుబాహుడుగా కండలు తిరిగిన శరీరంతో కనిపించవలసి ఉంటుంది. 

దీనికితోడు ‘ఉయ్యాలవాడ’ ఆరడుగుల ఆజానుబాహుడు అను చరిత్ర కారులు చెప్పుతూ ఉంటారు. అంతేకాకుండా తలపై పెద్ద తలపాగ బుర్ర మీసాలతో చాల కర్కశంగా ఉయ్యాలవాడ పాత్ర కనిపించాలి దీనితో ఇటువంటి గెటప్ చిరంజీవికి నప్పుతుందా అన్న విషయమై ప్రస్తుతం మెగా కాంపౌండ్ లో చాల లోతైన చర్చలు జరుగుతున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు దర్శకుడు సురేంద్ర రెడ్డి చిరంజీవి గెటప్ కు తలపాగా లేకుండా డిజైన్ చేస్తే బాగుటుంది అని సూచనలు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు దర్శకుడు సురేంద్ర రెడ్డి ‘ఉయ్యాలవాడ’ ఒరిజినల్ కథకు కొంతం ఫిక్షన్ జోడించినట్టుగా వార్తలు వస్తున్నాయి. 

దీనికితోడు పరుచూరి బ్రదర్స్ ఈసినిమాకు అందించిన స్క్రిప్ట్ విషయంలో కూడ చాల మార్పులు చేర్పులు సురేంద్ర రెడ్డి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ‘ఉయ్యాలవాడ’ కథను కేవలం చరిత్రగా కాకుండా వీలైనంత ఎక్కువ కమర్షియల్ అంశాలు కూడ జోడించి ఒక పోరాట యోధుడి జీవిత కథలా ప్రస్తుత తరం అభిరుచులకు అనుగుణంగా సురేంద్ర రెడ్డి భారీ మార్పులు ఈసినిమా కథలో చేస్తున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: