అల్లు అర్జున్ – పవన్ అభిమానుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపధ్యంలో ‘కాటమరాయుడు’ సినిమా గురించి బన్నీ అభిమానులు ఎటువంటి టాక్ ను ప్రచారంలోకి తీసుకు వస్తారు అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. పైకి కనిపించకపోయినా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ల మధ్య సరైన సాన్నిహిత్యం లేదు అన్న విషయం ఓపెన్ సీక్రెట్ గా మారింది. 

ఇలాంటి పరిస్థుతులలో లేటెస్ట్ గా విశాఖపట్నంలోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్ధుల సమావేశంలో పాల్గొన్న రామ్ చరణ్ తన బాబాయ్ ‘కాటమరాయుడు’ మూవీ టీజర్ ఎలా ఉంది అంటూ విద్యార్ధులను ప్రశ్నించడమే కాకుండా ఈ మూవీకి ఘన విజయం వచ్చేడట్లుగా సహకరించమని అక్కడి విద్యార్ధులను అడిగి అందరికీ షాకి ఇచ్చాడు చరణ్.  అంతేకాదు మెగా కుటుంబ హీరోలు ఎవ్వరూ ‘కాటమరాయుడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వెళ్లకపోయినా ఎవరు ఊహించని ఈ ఐక్యతారాగాన్ని ఆలాపించి తాను తన బాబాయ్ ఒకటే అంటూ సంకేతాలు ఇచ్చాడు చరణ్.

గత సంవత్సరం డిసెంబర్ లో విడుదలైన ‘ధృవ’ ఈ సంవత్సరం జనవరిలో విడుదలైన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలను సూపర్ హిట్ చేసినందుకు కృతజ్ఞతలు చెపుతూ అదే స్పూర్తిని ‘కాటమరాయుడు’ విషయంలో ఆపై దసరాకు రాబోతున్న సుకుమార్ దర్శకత్వంలోని తన సినిమా విషయంలో కూడ కొనసాగించమని కోరుతున్నాడు చరణ్. అయితే ఇక్కడ ఈ విషయంలోనే అల్లు అర్జున్ అభిమానులకు షాక్ ఇచ్చింది.

‘కాటమరాయుడు’ తరువాత ఇదే సమ్మర్ రేస్ లో అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’ రాబోతోంది. అయితే ఈసినిమాను కూడా చూడమని చరణ్ మాటవరసకు కూడ అనకపోవడం బన్నీ అభిమానులకు అసహనాన్ని కలిగిస్తున్నట్లు టాక్. 

దీనినిబట్టి చూస్తూ ఉంటే రామ్ చరణ్ అల్లు అర్జున్ ల మధ్య దూరం పెరుగుతోంది అని చెప్పడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ అని బన్నీ అభిమానులు వాదిస్తున్నట్లు టాక్.  అంతేకాదు ఇదే సమ్మర్ లో రాబోతున్న మరో మెగా కుటుంబ యంగ్ హీరో వరుణ్ తేజ్ ‘మిస్టర్’ సినిమాను కూడ చరణ్ మర్చి పోయాడు అని గుర్తుకు చేస్తున్నారు బన్నీ అభిమానులు. ఏది ఏమైనా చరణ్ నోటి వెంట ‘కాటమరాయుడు’ మాటలు వచ్చాయి కాబట్టి ఎటువంటి విభేదాలు లేకుండా చరణ్ చిరంజీవిల అభిమానులు అంతా ‘కాటమరాయుడు’ కు విజయాన్ని ఇస్తారనుకోవాలి..      


మరింత సమాచారం తెలుసుకోండి: