తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా మారిన న్యూస్ హీరో నిఖిల్ నటించిన కేశవ మూవీ. స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడకు పోతావు చిన్నవాడా వంటి సరికొత్త కథలను సెలెక్ట్ చేసుకుని సక్సెస్ ట్రాక్‌లో ఉన్న హీరో నిఖిల్, ఇప్పుడు మరో డిఫరెంట్ రోల్‌లో అలరించబోతున్నాడు. ‘రివెంజ్ ఈజ్ ఏ డిష్.. బెస్ట్ సర్వ్‌డ్ కోల్డ్’ అంటూ ‘కేశవ’ మూవీతో వస్తున్నాడు. 


తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ బయటకు వచ్చింది. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స ప్రకారం ఈ సినిమాని మొదటగా మంచు మనోజ్ చేయాల్సి ఉండగా....మనోజ్‌ రిజెక్ట్ చేయటంతో అది నిఖిల్ చేతికి వెళ్ళిందని అంటున్నారు. ఇక తాజాగా వచ్చిన కేశవ టీజర్ చూస్తే... నిఖిల్ చాలా వయొలెంట్ కేరెక్టర్‌ లో కనిపిస్తున్నారు. ‘భూతాన్ని.. యజ్ఞోపవీతాన్ని.. ఐప్లావ్య గీతాన్ని నేను. స్మరిస్తే పద్యం.. అరిస్తే వాద్యం. అనలవేదిక ముందు అస్త్ర నైవేద్యం..’ అంటూ నిఖిల్ చెప్పే డైలాగ్ ఓ రేంజ్‌లో ఉంది.


ఇంతటి హైప్ క్రియేట్ చేస్తున్న ఈమూవీని మంచు మనోజ్ చేస్తే బాగుండేదని అంటున్నారు. అయితే ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న ఈ మూవీ కచ్ఛితంగా హిట్ ని సాధించేదిగా ఉందని అంటున్నారు. ఇక కేశవ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు. భిన్నమైన కథలతో నిఖిల్ చేస్తున్న మూవీ ప్రేక్షకులను సైతం మెప్పిస్తున్నాయి.


నిఖిల్ తాజా చిత్రంపై అంచనాలు పెరగటంతో ఈ మూవీకి మార్కెట్ లో భారీ క్రేజ్ ఏర్పడుతుందని అంటున్నారు. నిఖిల్ మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అని అంటున్నారు. ఇక ఈ మూవీ కోసం నిఖిల్ సరికొత్తగా లుక్‌ ని ట్రై చేయటం జరిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: