స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా దువ్వాడ జగన్నాధం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ అదిరిపోతుందని అంటున్నారు. కెరియర్ లో మొదటిసారి బ్రాహ్మణ వేషం వేస్తున్న బన్ని మొదటి భాగం మొత్తం చాలా సరదాగా ఉంటాడట.


ఇక ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కు అదిరే రేంజ్లో ఫైట్ సీన్ ఉంటుందట. అక్కడ నుండి సినిమా రేంజ్ మారిపోతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫైట్ సీన్ కోసం హైదరాబాద్ లో రైల్వేస్టేషన్ సెట్ లో షూట్ చేస్తున్నారట. ఇప్పటికే టీజర్ కు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాను మరో సూపర్ హిట్ చేసుకునేలా కష్టపడుతున్నాడు అల్లు అర్జున్.


టీజర్ లో లుక్ తో సర్ ప్రైజ్ చేసిన డిజె ఇక కన్ఫాంగా ఆడియెన్స్ ను అలరిస్తాడట. సుబ్రమణ్యం ఫర్ సేల్ తర్వాత హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ డిజెతో సరికొత్త రికార్డులు షురూ చేయబోతున్నాడు. టీజర్ ఇప్పటికే కాటమరాయుడు టీజర్ కు పోటీ ఇవ్వగా మరో పక్క సినిమా కూడా ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా తీర్చిదిద్దుతున్నారట.  


పూజా గ్లామర్ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉండేలా చూస్తున్నారట. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సినిమా దిల్ రాజు బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతుంది. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న బన్ని ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: