తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి’.  దర్శకధీరుడు రాజమౌళి రెండు సంవత్సరాలు కష్టపడి తీసిన ఫ్యూజువల్ వండర్ ‘బాహుబలి’.  ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో సత్తా భారత దేశ ఎల్లలు కూడా దాటింది.  తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో ఈ చిత్రం ఎన్నో వండర్స్ క్రియేట్ చేసింది.   ప్రస్తుతం బాహుబలి 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్స్, ట్రైలర్ రిలీజ్ అయ్యింది.  
Image result for baahubali 2
ప్రస్తుతం భారత దేశం యూట్యూబ్ చరిత్రలో రికార్డుల మోత మోగిస్తుంది బాహుబలి 2 ట్రైలర్.  భారత దేశం లోని సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం బాహుబలి-2. మొదటి భాగంతో ఇండియన్ ఫిల్మ్ రికార్డులన్నీ తిరగ రాసిన ఈ చిత్రం ఈ సారి 1000 కోట్లను టార్గెట్ చేసింది. ప్రస్తుతం బాహబలి 2 కి సంబంధించిన ప్రమోషన్ వర్క్ లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్.  అంతా బాగుందనుకున్న సమయంలో కట్టప్ప రూపంలో షాక్ తగిలిందట రాజమౌళికి.  బాహుబలి 2 ను మా దగ్గర విడుదల చేయొద్దంటూ కన్నడ లోని కొన్ని సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి.
Image result
గతంలో కావేరి పోరాటాల్లో పాలుగొన్న నాయకుల పై కామెంట్ చేసాడని అందుకు నిరసనగా సత్య రాజ్ నటించిన చిత్రాన్ని మా రాష్ట్రము లో విడుదల చేయవద్దంటూ బెంగుళూరులోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద నిరసనకు దిగారు. అంతే కాదు అతను కట్టప్ప కాదని కెట్టప్ప ( కెట్టప్ప అంటే కన్నడ భాషలో చెడ్డ వాడని అర్ధం ) అంటూ అవహేళన చేసారు.
Image result for baahubali 2
ఇక బాహుబలి మొదటి భాగం అందుకున్న విజయం తో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి లాభాలను తెచ్చిపెట్టడం తో రెండవ భాగాన్ని 30 కోట్లకు పైగా కొనుగోలు చేశారు. అయితే అక్కడ జరుగుతున్న గొడవలను బట్టి చూస్తే సినిమా రిలీజ్ కష్టంగా మారడం తో అక్కడి పంపిణి దారులు ఆందోళన చేస్తున్న సంఘం నాయకులతో చర్చిస్తున్నారట.  మొత్తానికి బాహుబలి 2 చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేస్తారా..? లేదా అన్నది త్వరలో తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: