రేపు విడుదల అవుతున్న ‘కాటమరాయుడు’ మూవీ క్రేజ్ తారా స్థాయికి చేరుకున్న నేపధ్యంలో ఈసినిమా పై అంచనాలు విపరీతంగా పెరిగి పోయాయి. దీనితో ఈసినిమాతో కలిసి వస్తే తమకు కూడ క్రేజ్ బాగా వస్తుందని చాలామంది హీరోల ఆలోచన. దీనితో పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ తో నాలుగు కొత్త సినిమాల  ట్రైలర్లు అటాచ్ అయ్యాయి. 

పవన్ సినిమాల్ని చూడ్డానికి  ప్రేక్షకులు పెద్దయెత్తున ఎగబడతారు కాబట్టి ఆ సినిమాలతో పాటుగా కొత్త సినిమాల  ట్రైలర్లని రిలీజ్  చేస్తే  మంచి ప్రచారం లభిస్తుందిఅన్న ఎత్తిగాదతో ఈ నిర్ణయంలో చాలామంది హీరోలు ఉన్నారు.   ఈ లిస్టులో వరుణ్ తేజ్ ‘మిస్టర్’ తో పాటు వెంకటేష్ ‘గురు’  కార్తి ‘చెలియా’ నిఖిల్ నటించిన ‘కేశవ’ సినిమాలు ఉండటంతో వాటికి సంబంధించిన ట్రైలర్లని ‘కాటమరాయుడు’ ప్రింట్లకి ఎటాచ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఒకొక్క చోట ఒక్కో ట్రైలర్ ప్రదర్శితమవుతుంది అని తెలుస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా పెద్దయెత్తున విడుదలవుతున్న ‘కాటమరాయుడు’  క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమాల హీరోలు అంతా ప్రయత్నిస్తున్నారు. పవన్ మాత్రం ఎవరి ట్రైలర్ నీ కాదనకుండా అందరి సినిమాల ట్రైలర్లూ తన సినిమాతో పాటు ప్రదర్శితమయ్యేలా సహకరించాలని నిర్మాతకి సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా రేపు విడుదల కాబోతున్న ‘కాతమరాయుడు’ ఫలితం పై నెగిటివ్ టాక్ ఫిలింనగర్ లో విపరీతంగా హడావిడి చేస్తోంది.  అందజేశాడు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ అభిమానులు ఈ నెగిటివ్ టాక్ ను ప్రచారం చేస్తున్నారు అని మొదట్లో భావించినా పవన్ ను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లాభపడిన కొందరు వ్యక్తులు కూడ రాజకీయ ఉద్దేశాలతో ఈ నెగిటివ్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనికితోడు ‘కాటమరాయుడు’ సినిమా ప్రమోషన్ ను ఒక ప్రముఖ ఛానల్ ఎక్కువగా చేస్తున్న నేపధ్యంలో ఈసినిమా విషయంలో ఎక్కడో ఎదో తేడా కొట్టింది అని అందువల్లనే ఎప్పుడూ లేని విధంగా ఈసినిమాను ఇంతలా ప్రమోట్ చేసి చూపిస్తున్నారంటూ రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు ఈమూవీ ఫైనల్ అవుట్ పుట్ చూసినవారు ఇప్పటికే ఈ సినిమా ఫెయిల్ అవుతుంది అన్న దిగులుతో పవన్ టెన్షన్ పడుతున్నాడు అన్న వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఏమైనా మరి కొన్ని గంటలలో ‘కాటమరాయుడు’ భవిష్యత్ తేలిపోతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: