కమర్షియల్ డైరక్టర్ అంటే నిర్మాత డబ్బులను ఖర్చు పెట్టడమే అన్న మాటని నిజం చేస్తూ కథ అనేదే లేకుండా కోట్లకు కోట్ల ఖర్చుతో సినిమాలు తీసి ఫ్లాప్ అందించిన దర్శకుడు మెహెర్ రమేష్. కంత్రి, బిల్లా లాంటి స్టైలిష్ సినిమాలు తీస్తాడనే నమ్మకంతో అతనికి శక్తి అనే సినిమా ఇచ్చి అశ్వనిదత్ కు భారీగా లాస్ తెచ్చిపెట్టాడు.


ఆ దెబ్బతో అశ్వనిదత్ సినిమాలు తీయడమే ఆపేశారంటే శక్తి ఎంత లాస్ తెచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత వెంకటేష్ కెరియర్ అత్యంత వరస్ట్ ఫ్లాప్ గా పేరుకెక్కిన సినిమా షాడో అది కూడా మెహెర్ రమేష్ డైరక్షన్ లో వచ్చిన సినిమానే. ఇక అప్పటినుండి ఆ డైరక్టర్ తో సినిమా అంటే నిర్మాతలే కాదు హీరోలు కూడా అతని పేరెత్తితే పారిపోయే పరిస్థితి వచ్చింది.


మెగా కుటుంబానికి దగ్గర చుట్టమే అయిన మెహెర్ రమేష్ మెగా హీరోలతో సినిమా చేయలేదు. ప్రస్తుతం యాడ్స్ ను డైరెక్ట్ చేస్తూ కాలం గడుపుతున్న మెహెర్ రమేష్ ఇప్పుడు ఓ మెగా హీరోతో సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. మెగా బ్రదర్ నాగబాబుని కలిసి తన తనయుడు వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తానని చెబుతున్నాడట మెహెర్ రమేష్.


మొహమాటానికి నాగబాబు సరే అనక తప్పట్లేదట. ప్రస్తుతం వరుణ్ తేజ్ మిస్టర్, ఫిదా సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాల రిజల్ట్ ను బట్టి మెహెర్ తో సినిమా చేయాలా వద్దా అని నిర్ణయించుకుంటాడట. మెగా ఫ్యామిలీ డైరక్టర్ కాబట్టి మెహెర్ కు మెగా హీరోలే ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి వచ్చిన అవకాశాన్ని అతను కూడా సరిగా వాడుకుని మంచి హిట్ అందిస్తే బాగుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: