ఇండస్ట్రీ లో హీరోలకీ , డైరెక్టర్ లకీ ఆ మాటకొస్తే వారిద్దరి కంటే ఎక్కువ ప్రొడ్యూసర్ లకి బ్యాడ్ టైం నడుస్తుంది. అది చాలా సహజం కానీ శ్రీను వైట్ల పరిస్థితి చాలా దారుణం బ్యాడ్ టైం లో బ్యాడ్ టైం అన్నమాట. ఒక పక్క ప్రకాష్ రాజ్ తో గొడవ, కోన వెంకట్ తో గొడవ మరొక పక్క దూకుడు లాంటి చిత్రం తర్వాత వచ్చిన ఆగాడు అట్టర్ ప్లాప్ అవ్వడం. భారీ లాస్ లు మూట గట్టుకోవడం ఇలా అనేకానేక విషయాల్లో శ్రీను వైట్ల కుంగిపోయారు. ఇవి చాలవు అన్నట్టు తన భార్య రూప వైట్ల తో పర్సనల్ గొడవలు విడాకుల దాకా వెళ్ళడం మరొక విశేషం.


నెమ్మదిగా అన్నీసర్దుకుంటున్నాయి అనే టైం లో ఏ హీరో వైట్ల కి ఛాన్స్ ఇవ్వడానికి భయపడ్డారు. డైరెక్టర్ గ తనకంటూ ఒక రేంజ్ ఉన్నా కూడా ఆగాడు లాంటి భారీ బ్లాక్ డిజాస్టర్ తరవాత అందరూ ఒక్క అడుగు వెనక్కే వేసారు. అయితే ముందు ఇచ్చిన మాట కారణంగా రామ్ చరణ్ శ్రీను వైట్ల తో సినిమా చేసాడు. కానీ ఒకే ఒక్క కండిషన్ మీద , కోనా - శ్రీను లు గొడవలు మానేసి కలిసిపోతే కానీ తాను సినిమా చెయ్యను అని మొండి పట్టు పట్టుకుని కూర్చున్నాడు చెర్రీ అది చూసి ఓకే చెప్పారు ఇద్దరూ.


మొత్తం మీద బ్రూస్ లీ సినిమా ని బయటకి తీసారు కట్ చేస్తే అది కూడా మెగా డిజాస్టర్. ఈ రెండు వరస దెబ్బలతో హీరోలు అందరూ శ్రీను వైట్ల పేరు చెబితే భయపడడం మొదలెట్టారు. కొన్నాళ్ళ వెతుకులాట తరవాత వరుణ్ తేజ్ శ్రీను వైట్ల తో సినిమాకి ఒప్పుకున్నాడు. తేజ - వైట్ల కలయిక లో రూపు దిద్దుకున్న చిత్రం ఇది. లావణ్య త్రిపాఠి , హేబా పటేల్ హీరోయిన్ లు గా చేసారు .. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల అయింది. గత సినిమాలు నేర్పిన పాఠాలు శ్రీను వైట్ల బాగానే వంట పట్టించుకున్నారు అని పక్కగా చెప్పచ్చు.


హీరో - అతని కుళ్ళు కామెడీ నుంచి శ్రీను వైట్ల బయట పడ్డారు అని పక్కగా చెప్పచ్చు. విలన్స్ బకరాలు చేసి నవ్వించే కార్యక్రమం పెట్టుకోలేదనిపిస్తుంది. మొత్తంమ్మీద మిస్టర్ మారాడు అనిపిస్తుంది. లవ్ స్టోరీ కాదు కాదు లవ్ స్టోరీ లు ఇన్వాల్వ్ చేసిన శ్రీను వైట్ల సొంతం , ఆనందం లాంటి ఒక సూపర్ ప్రేమ కథ కే యాక్షన్ సీక్వెన్స్ ని జోడించారు. పూర్తి కమర్షియల్ ఎలెమెంట్స్ తో వస్తున్న ఒక ప్రేమకథా చిత్రం అనమాట ఇది. అమెరికా , ఇండియా లలో జరిగే ఈ ప్రేమకథ లో లావణ్య తో ప్రేమలో పడిన హీరో మళ్ళీ హేబా వైపు ఎందుకు నడిచాడు అనేది అర్ధం కాని విషయం. మొత్తం మీద మిస్టర్ శ్రీను వైట్ల కి బుద్ధొచ్చింది అనీ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకునే తీసాడు అని అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: