కొన్ని గంటల్లో పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం కాటమరాయుడు విడుదల అయిపోతుంది. ఈ సినిమా కి సంబంధించి ప్రమోషన్ లు డల్ గా ఉన్నా క్రేజ్ మాత్రం అమాంతం పవన్ కళ్యాణ్ కి తగ్గట్టుగా సాగుతోంది. భారీ అంచనాలతో వచ్చిన సర్దార్ బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్డంగా పోవడంతో ఈ కొత్త సినిమా మీదనే పవన్ తో పాటు అతని అభిమానులు కూడా ఆశలు పెట్టుకున్నారు.


సర్దార్ దెబ్బతో నష్టపోయిన పంపిణీ దారులకి కాటంరాయుడు న్యాయం చేస్తాను అని మాట అయితే ఇచ్చాడు కానీ నిజానిజాలు చూసుకుంటే మాట ఇచ్చినట్టు న్యాయం జరగలేదు . సర్దార్ సినిమా కొన్న వారిలో , లాస్ అయినవారి లో ఒక్కరికి కూడా కాటమరాయుడు సినిమా హక్కులు అమ్మలేదు. దీంతో సర్దార్ బాధితులు అందరూ నిరాహార దీక్ష కి దిగిన సంగతి తెలిసిందే. వారు అలా అన్నం తినకుండా కూర్చున్నా కూడా పవన్ కళ్యాణ్ మనసు కరగలేదు.


ఆ దీక్ష ని ఆయన మినిమం కూడా పట్టించుకోక పోవడం విశేషం. ఈ వివాదం తోనే కాటమరాయుడు మునిగిపోయి ఉంటే మరొక పక్క నుంచి ఈ సినిమా ని రెండు వారాల పాటు స్వచ్చందంగా బ్యాన్ చెయ్యాలి అంటూ అఖిల భారత సినిమా ప్రేక్షకుల వినియోగదారుల సంఘం అధ్యక్షుడు నరసింహారావు కోరుతున్నారు.


భారీ వసూళ్ళు దురాశతో కాటమరాయుడు సినిమా టికెట్ల ధరలను నాలుగైదు రెట్లు పెంచారని, రెండు వారాల పాటు థియేటర్లలో టిక్కెట్‌ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతి కోరుతూ కొందరు థియేటర్‌ దోచుకుంటున్నాయి అనేది వారి ఆరోపణ. రెండు వారాల పాటు కాటంరాయుడు భాహిష్కరిస్తే దెబ్బకి ప్రొడ్యూసర్ లు దిగి వస్తారు అనేది వారి ప్లాన్. అయితే అలా బ్యాన్ చెయ్యమని చెప్పిన వ్యక్తులు ఎవ్వరికీ పెద్దగా తెలీదు, పబ్లిసిటీ కూడా లేకపోగా పవన్ లాంటి పెద్ద స్టార్ సినిమాకి జనం ఎవరి మాటో ఎందుకు వింటారు? అందుకే విపరీతమైన బుకింగ్ లు ప్రస్తుతం నడుస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: