మరో మూడు రోజులలో ‘బాహుబలి 2’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతున్న నేపధ్యంలో ఈమూవీలోని పాటల విడుదలకోసం అందరూ ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పూర్తి అయినతరువాత ఎవరూ ఊహించనంత భారీస్థాయిలో ఈమూవీ ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టడానికి రాజమౌళి ఇప్పటికే భారీప్రణాళికలు రచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఈవిషయాలు అన్నీ ‘బాహుబలి 2’ రైట్స్ ను అత్యంత భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లకు ఆనందం కలిగిస్తూ ఉన్నా ఈసినిమా ఓవర్సీస్ రైట్స్ ను కొనుక్కున్న బయ్యర్ కు మాత్రం ఈసినిమాకు సంబంధించి 15 మిలియన్ డాలర్ల టెన్షన్ మొదలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. సామాన్యంగా మన తెలుగుసినిమాలకు సంబంధించి ఒక టాప్ హీరో సినిమాకు రెండు మిలియన్ డాలర్స్ కలక్షన్స్ వస్తేనే చాలగొప్పగా చెపుతూ ఉంటారు. 

అయితే ఇప్పుడు ‘బాహుబలి 2’ సంబంధించి ఏకంగా 15 మిలియన్ డాలర్ క్లబ్బు గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థుతులు ఏర్పడ్డాయి. ఈమూవీ ఓవర్సీస్ లో 15 మిలియన్ డాలర్లు కలక్ట్ చేసినప్పుడు మాత్రమే ఈసినిమా ఓవర్సీస్ బయ్యర్ గట్టెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికికారణం ఈసినిమా ఓవర్సీస్ బయ్యర్ ఏకంగా 45 కోట్లరూపాయలను వెచ్చించి అమెరికాకు సంబంధించి ‘బాహుబలి 2’ నాలుగు బాషల రైట్స్ కొనుకున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే అమెరికాలో ఒక సింగిల్ లాంగ్వేజ్ లో అత్యధిక వసూళ్ళు వచ్చిన సినిమా అంటే ఒక్క ‘దంగల్’ సినిమా మాత్రమే కనిపిస్తుంది. ఆ సినిమాకు 12 మిలియన్ డాలర్ల కలక్షన్స్ వచ్చాయి. అయితే గతంలో విడుదలైన ‘బాహుబలి’ ది బిగినింగ్ 6 మిలియన్ డాలర్లు వసూలు చేసిన నేపధ్యంలో ఆరికార్డులను దృష్టిలో పెట్టుకుని తెలుగుతో పాటుగా తమిళ మళయాళ హిందీ భాషల రైట్స్ ను దృష్టిలో పెట్టుకుని ‘బాహుబలి 2’ 15 మిలియన్ డాలర్స్ కలక్షన్స్ రావడం చాలసులువు అన్న ఉద్దేశ్యంతో ఈ ఓవర్సీస్ బయ్యర్ ఏకంగా ‘బాహుబలి 2’ పై 45 కోట్ల జూదం ఆడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనితో ఈ అంచనాలలో ఏమాత్రం తేడా వచ్చినా ‘బాహుబలి 2’ ఓవర్సీస్ బయ్యర్ ఘోరంగా నష్టపోతాడు అన్న ప్రచారం ఫిలింనగర్ లో జరుగుతోంది. దీనికితోడు మన ఇరు రాష్ట్రాలలోని ఏరియాలకు సంబంధించి ‘బాహుబలి 2’ ను భారీ మొత్తాలకు బయ్యర్లు కొనుక్కున్న నేపధ్యంలో ఈసినిమా గురించి ఎంత పాజిటివ్ టాక్ వస్తున్నా లోలోపల ఈ సినిమా బయ్యర్లు భయపడిపోతున్నారని టాక్..   




మరింత సమాచారం తెలుసుకోండి: