తెలుగు,తమిళ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు శంకర్.  ఇప్పటి వరకు ఓటమి ఎరుగుని దర్శకుల్లో ఒకరు శంకర్.  ఇక ఈయన దర్శకత్వంలో ఒక్క సినిమాలో అయినా నటిస్తే చాలనుకునే టాప్ హీరోలు చాలా మంది ఉన్నారు.  అయితే ఆ మద్య రజినీకాంత్ తో ‘రోబో’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  భారత దేశంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంలో ఒకటిగా నిలిచింది.  ఆ తర్వాత రజినీకాంత్, శంకర్ ఇద్దరికీ టైమ్ అస్సలు కలిసి రావడం లేదు.  

హీరో విక్రమ్ తో ఎన్నో అంచనాలు పెట్టుకొని ఓ ప్రయోగాత్మక చిత్రం ‘ఐ’ తీశారు..కానీ అనుకున్న స్థాయిలో డబ్బు రాబట్టలేక పోయింది.  తాజాగా మరోసారి ఈ ఇంద్దరి కాంబినేషన్ లో రోబో 2.0 చిత్రంతో అభిమానుల ముందుకు రాబోతున్నారు.  ఇప్పటికలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది..కాకపోతే కొంత ప్యాచ్ వర్క్ మాత్రం ఉంది దాన్ని షూట్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. అయితే రోబో సీక్వేల్ షూటింగ్ జరుగుతున్న ప్లేస్ కి వెళ్లి షూటింగ్ కవరేజ్ చేస్తున్న జర్నలిస్ట్ ని కొట్టారు ఆ చిత్ర బౌన్సర్లు .

ఇద్దరు జర్నలిస్ట్ లు కవరేజ్ కోసం వెళ్ళగా వారి దారుణంగా కొట్టి పంపించారు.  జర్నలిస్టులపై యూనిట్ దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. దాంతో గాయాలు అయిన ఇద్దరు జర్నలిస్టు లు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు . పోలీసులు కేసు నమోదు చేసుకుని చిత్రం అసిస్టెంట్ డైరెక్టర్‌‌ని, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.అయితే కేసు ఉపసంహరించుకోబోమని, దర్శకుడు క్షమాపణ చెప్పాలని బాధితులు డిమాండ్ చేయడంతో డైరెక్టర్ శంకర్ మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పాడు.
Related image
ఈ దాడి విషయం తనకు తెలియదని చెప్పిన ఆయన.. అప్పుడు సెట్‌లో తాను లేనని, ఏమైనా ఈ ఘటనకు విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నాడు. ఇలాంటివి ఇకముందు పునరావృతం కాకుండా చూస్తానని శంకర్ హామీ ఇచ్చాడు.దర్శకులు శంకర్ క్షమాపణ చెప్పఁడంతో జర్నలిస్టులు పెట్టిన కేసు ని విత్ డ్రా చేసుకున్నారు దాంతో ఆ వివాదం సద్దుమణిగింది . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 2. 0 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి .


మరింత సమాచారం తెలుసుకోండి: