టైటిల్ చూడగానే కంగారు పడకండీ..తెలుగు,తమిళ ఇండస్ట్రీలో రాక్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలిగిపోతున్న దేవీశ్రీ ప్రసాద్ శవంతో ఏం చేశాడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయా..! అబ్బే దేవీశ్రీ ప్రసాద్ అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ కాదండీ బాబూ..స్వామిరారా' మూవీ ఫేమ్ పూజా రామ్ చంద్రన్, ధనరాజ్, మనోజ్ నందం లీడ్ రోల్స్ చేస్తున్న సినిమా 'దేవీశ్రీప్రసాద్'.  

ఈ మద్య హర్రర్, థ్రిల్లర్,కామెడీ కాన్సెప్ట్ తో ఎన్నో చిత్రాలు వస్తున్నాయి..అందులో దాదాపు అన్ని మంచి విజయాలు సాధించినవే.  దీంతో ఇదే కాన్సెప్ట్ తో థ్రిల్లర్, కామెడీతో వస్తున్న చిత్రం ‘దేవీశ్రీప్రసాద్’.

ఈ టీజర్లో.. ధనరాజ్, మనోజ్ లు హీరోయిన్ పూజా శవం మీద తీసిన సీన్స్ మీద సోషల్ మీడియాలో కామెంట్లు పడిపోతున్నాయి. కథానుసారంగా..ఇలా చూపించారా లేదా కావాలనే ఆకట్టుకోవాలనీ..చూపించారా అనేదీ సస్పెన్స్ కి తెరలెపుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: