తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాన్ ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  కొత్తలో అనుకున్న సక్సెస్ సాధించలేకపోయిన పవన్ ఖుషి, తమ్ముడు, జల్సా లాంటి సినిమాతో ఒక్కసారే స్టార్ డమ్ పెంచుకున్నాడు.  ఇక గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత మాస్, క్లాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఇండస్ట్రీలో ఇప్పుడు పవన్ అంటే ఓ ప్రభంజనం..ఆయన సినిమా రిలీజ్ అంటే భారీ ఓపెనింగ్స్..హంగామా ఉంటుంది.  
Katamarayudu
ఇప్పటికే ఫ్యాన్స్ థియేటర్ల వద్ద పవన్ కళ్యాన్ భారీ కౌటట్స్ పెట్టి ధూమ్..ధాం చేస్తున్నారు.  గత సంవత్సరం ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయ్యింది..కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేక పోయింది.  ఈ సారి సినిమాపై భారీ అంచనాలు ఉన్నా ఆ అంచనాలు దాటి పోతారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్.  ఈ సంవత్సరం మెగా స్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ తో మంచి బోనీ కొట్టారు..ఇప్పుడు పవన్ కూడా ‘కాటమరాయుడు’ చిత్రంపై కూడా తెగ అంచనాలు పెరిగిపోయాయి.

ఈ మద్య స్టార్ హీరోలు ఇక్కడ కంటే ఓవర్సీస్ పైను కన్నెస్తున్నారు. ఈ నేపథ్యంలో  ఓవర్సీస్ లో కాటరాయుడు, ఓపెనింగ్ కలెక్షన్స్ భారీ ఎత్తున రాబట్టాలని ప్లాన్ చేశాడు.  ఇందులో భాగంగానే రెండురోజుల కిందటే కాటమరాయుడు ప్రింట్స్ యూఎస్‌కి వెళ్లినట్టు సమాచారం. దీంతో అనుకున్న టైంలో రాయుడు షోలు పడనున్నాయి. అమెరికాలో మొత్తం 250 స్క్రీన్స్‌లో రాయుడుని రిలీజ్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  ఇక రజినీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రం రిలీజ్ రోజు కొన్ని ఐటీ కంపెనీలు సెలవు రోజుగా ప్రకటించాయి.  

ఇప్పుడు కాటమరాయుడు చిత్రానికి కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. శుక్రవారం కాటమరాయుడు భారీఎత్తున రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రముఖ నగరాల్లో కొన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు ఇచ్చేశాయి. శుక్రవారం చేయాల్సిన పనిని ఆదివారం చేసేలా సదుపాయాన్ని కల్పించింది ఓ ఐటీ కంపెనీ. 


మరింత సమాచారం తెలుసుకోండి: