తెలుగు ఇండస్ట్రీలో అఖండ విజయం సాధించి ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటిన చిత్రం ‘బాహుబలి’.  ఈ చిత్రం కోసం దర్శకధీరుడు రెండు నెలల ముందు నుంచి పక్కా ప్లాన్ తో సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టించారు.  దీంతో బాహబలి చిత్రంపై విపరీతమైన క్రేజ్ రావడం అనుకున్న దానికన్నా ఎక్కువే సక్సెస్ సాధించడంతో ఇప్పుడు బాహుబలి 2 చిత్రంపై అదే రీతిలో ఫోకస్ చేస్తున్నారు రాజమౌళి.  ఇప్పటికే ఫస్ట్ లుక్స్, ట్రైలర్ తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న బాహుబలి 2 చిత్రం ఆడియో రిలీజ్ కూడా భారీ స్థాయిలో చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.  
Image result for baahubali 2 posters
కానీ ఇప్పుడు రాజమౌళికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.  ప్రమోషన్ పరంగా తమకు ఎదురే లేదు అనుకుంటూ దూసుకుపోతోన్న జక్కన్నకు ఝలక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీస్ లు. ఈ నెల 26న హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీలో బాహుబలి- ద కంక్లూషన్ ఆడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.  ఈ ఆడియో ఫంక్షన్ కి కనీసం 30 వేల మంది టార్గెట్ చేసుకున్నారు రాజమౌళి.
Image result for baahubali 2 posters
బాహుబలి ఆడియో ఫంక్షన్ ఐదువేల మంది అంటే అనుకున్న స్థాయికన్నా చాలా తక్కువే. దీంతో ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదట రాజమౌళికి. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి..అంతే కాదు బాహుబలి చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు కూడా వచ్చింది. దీంతో తమ సినిమా కదా పర్మిషన్ పెద్ద మేటర్ కాదులే అనుకున్న వీరికి పోలీస్ లు ఖచ్చితంగా చెప్పేసరికి షాక్ తిన్న రాజమౌళి ఇప్పుడు వెన్యూ మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
Image result for baahubali 2 posters
ఒకవేళ  అదే డేట్ లో ఆడియో రిలీజ్ ఫంక్షన్ వేరే చోట ప్లాన్ చేయాలంటే మళ్లీ మొదటి నుంచి అన్ని ఏర్పాట్లూ వీళ్లే చేసుకోవాలి. అదే  ఫిల్మ్ సిటీలో అంటే అన్ని ఏర్పాట్లూ ఇన్ స్టంట్ గా ఉంటాయి. మరి ఈసారి కూడా రిలీజ్ ఫంక్షన్ తిరుపతిలోనే ప్లాన్ చేస్తారా..లేద హైదరాబాద్ లోనే మరో  వెన్యూ చూసుకుంటారా అన్న విషయం త్వరలో తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: