యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న అప్ కమింగ్ మూవీ షెడ్యూల్స్ వరుసగా షూటింగ్ ని జరుపుకుంటున్నాయి. కొరటాలశివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రం వరువాత వస్తున్న చిత్రం కావటంతో ఈ మూవీపై మార్కెట్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీకి సంబంధించిన విషయాల్లోకి వెళితే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత కొంత కాలంగా ఓ విషయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారని అంటున్నారు. తను ప్రయత్నించినా కొన్ని సందర్భాల్లో దాన్ని కంట్రోల్ చేయటం కష్టంగానే ఉందని అంటున్నారు.


అయితే ఇప్పుడు తన అన్న నిర్మాతగా వస్తున్న చిత్రంలో హీరోగా చేస్తుండటంతో…ఇప్పుడు కంట్రోల్ చేసుకోవటం తప్పని సరి అయిందని అంటున్నారు. దీనికి సంబందించిన వివరాల్లోకి వెళితే…యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో చేస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకుంటుంది. ఫిబ్రవరి 20 నుండి ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రారంభం జరిగింది. ఇక ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు.


ఇందుకోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు 12 కేజీల వరకు బరువు తగ్గారట. కంత్రి మూవీ తరువాత నుండి తన బరువును పెరగకుండా కాపాడుకుంటూ వస్తున్న ఎన్టీఆర్…జనతాగ్యారేజ్ మూవీలో కాస్త బొద్దుగా కనిపించిన సంగంతి చూసిందే. అయితే తన వెయిట్ ని కంట్రోల్ చేయకపోతే ఇంకా బొద్దుగా కనపడే అవకాశం ఉందని అంటున్నరు. బరువు విషయంలో ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా…కొన్ని సందర్భాల్లో అది కుదరటం లేదని స్నేహితులతో ఎన్టీఆర్ చెప్పినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి.


ఇదిలా ఉంటే ప్రస్తుతం తను తగ్గిన బరువుతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా ఫిట్ గా ఉన్నారని అంటున్నారు. ఇక కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాబీ డైరెక్ట్ చేస్తున్నారు. హీరోయిన్ గా రాశి ఖన్నాను ఫైనల్ చేయగా రెండో హీరోయిన్ గా నివేత థామస్ ను కన్ఫర్మ్ చేయనున్నారు. మొత్తంగా ముగ్గురు హీరోయిన్స్ ఉన్న ఈ సినిమాలో మూడో హీరోయిన్ ని కొత్తవారిని తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: