ప్రస్తుతం దేశమంతా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా బాహుబలి అన్నట్టే. మొదటి పార్ట్ తో సంచలనంగా మారిన బాహుబలి సినిమా సెకండ్ పార్ట్ ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. తెలుగు సినిమానే అయినా బాలీవుడ్ లో కూడా ఈ సినిమా సంపాదించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. 


ఇక ఉత్తరాదిన స్టార్ సినిమాల రిలీజ్ అంటే కనీసం 4000 థియేటర్స్ లో సినిమా రిలీజ్ అవ్వాల్సిందే. ఇక వేరే సినిమాలేవి లేకపోతే 5000 థియేటర్ల దాకా రిలీజ్ చేస్తారు. అయితే బాహుబలి సినిమా మాత్రం ఏకంగా 6500 నుండి 7000 థియేటర్స్ దాకా రిలీజ్ చేస్తారని అంటున్నారు. దక్షిణాది సినిమా ఈ రేంజ్లో రిలీజ్ అవడం పెద్ద రికార్డ్ అన్నట్టే.


సినిమా భారీగా రిలీజ్ చేయడం అంటే భారీ లక్షన్స్ మీద దృష్టి పెట్టినట్టే. మొదటి రోజే 100 నుండి 150 కోట్ల టార్గెట్ తో వస్తున్న బాహుబలి ఆ అంచనాలను అందుకునే సత్తా ఉందని ట్రైలర్ తో ప్రూవ్ చేసుకుంది. మొదటి పార్ట్ లో కేవలం పాత్రల పరిచయం మాత్రమే చేశానని చెప్పిన రాజమౌళి సెకండ్ పార్ట్ లో అసలు కథ నడుస్తుందని చెప్పాడు.


రిలీజ్ అయిన ట్రైలర్ దాని రెస్పాన్స్ చూస్తే సినిమా చూసేందుకు ఆడియెన్స్ ఎంత ఎక్సయిటింగ్ గా ఉన్నార్ అర్ధమవుతుంది. మరి ఈ రేంజ్ క్యూరియాసిటీ ఉన్న ఈ సినిమా 7వేళ థియేటర్స్ లో రిలీజ్ అంటే సినిమా అందరు అనుకున్నట్టు 1000 కోట్ల కలక్షన్స్ సాధించడం పెద్ద కష్టమేం కాదని చెప్పొచ్చు. అది కనుక నిజం అయితే మాత్రం భారత సిని చరిత్రలో బాహుబలి ఓ అద్భుత కళాకండంగా నిలుస్తుదని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: