‘కాటమరాయుడు’ రెగ్యులర్ షోలు ఇంకా మన ఇరు రాష్ట్రాలలోను ప్రారంభం కాకపోయినా విదేశాల నుంచి ఈ సినిమాకు సంబంధించి అందుతున్న సమాచారం మేరకు ఈమూవీ ఫస్టాఫ్‌ లోని కామెడీ ప్లస్ పాయింట్ అని పవన్‌ వన్‌మాన్‌ షో చేశాడని వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ ‘అత్తారింటికి దారేది’ స్టయిల్‌ లో చలాకీగా కనిపించాడని ఈసినిమాను చూసిన సగటు ప్రేక్షకుడు కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

అదేవిధంగా క్లైమాక్స్‌లో వచ్చే బ్రదర్స్ మధ్య ఎమోషన్‌ సీన్స్ బాగున్నాయని దీనికితోడు శ్రుతి‌హాసన్‌తో పవన్ లవ్‌ ట్రాక్‌ యూత్ ను బాగా ఆకట్టుకుంటుందని అదేవిధంగా  ఈసినిమాలో అన్నదమ్ముల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయని ఈసినిమాను చూసిన ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమా అంతా పవన్ పంచెకట్టుతో కనిపిస్తూ ఉండటంతో పవన్ డిఫరెంట్ గెటప్ మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అయితే పవన్ ఈసినిమాలోని పాటలు, డ్యాన్స్‌లపై మరింత ఫోకస్ చేస్తే బాగుండేది అన్న కామెంట్స్ వస్తున్నాయి. పవన్ అభిమానులు మాత్రం ఈసినిమా సూపర్ హిట్ అని ‘అత్తారింటికి దారేది’ తర్వాత మరో హిట్ పవన్ సొంతం అయింది అన్న టాక్ ను నిన్న అర్దరాత్రి కొన్ని ప్రాంతాలలో జరిగిన స్పెషల్ షోలు చూసిన తరువాత ఈ కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే ప్రస్తుతం బయటకు వస్తున్నది కేవలం పవన్ వీరాభిమానులు ప్రచారం చేస్తున్న టాక్ కాబట్టి ఈసినిమాకు సంబంధించిన రియల్ టాక్ ఈమూవీ రెగ్యులర్ షోలు పూర్తి అయిన తరువాత మాత్రమే స్పష్టంగా తెలుస్తుంది అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈమూవీకి సంబంధించి టిక్కెట్లు అన్నీ  అడ్వాన్సు బుకింగ్ లు క్లోజ్ అయిపోయిన నేపధ్యంలో ఈమూవీ తొలిరోజు కలక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అన్న అంచనాలు అప్పుడే ప్రారంభం అయ్యాయి. 

సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నెంబర్ 150” సినిమా ద్వారా అందుకున్న తొలిరోజు రికార్డులను పవన్ ‘కాటమరాయుడు’ బ్రేక్ చేయగలుగుతుందా అన్న అంచనాలు కూడ టాలీవుడ్ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు.  ఏది ఏమైనా పవన్ సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రికార్డులు క్రియేట్ చేయడం చాల సులువైన పని అని గత జరిగిన సంఘటనలే ఉదాహరణ..



మరింత సమాచారం తెలుసుకోండి: