మెగా బ్రదర్స్ మధ్య చిన్నచిన్న భేదాభిప్రాయాలు ఉన్నా పవన్ కు తన అన్నలు చిరంజీవి నాగబాబులంటే విపరీతమైన ప్రేమ. ఈవిషయాలను స్వయంగా పవన్ అనేక సందర్భాలలో బహిరంగంగానే చెప్పాడు. అయితే అటువంటి పవన్ తన అన్న నాగబాబుని తిట్టమని ప్రోత్సహించిన సంఘటన ఒకటి ఈ మధ్య వెలుగులోకి వచ్చింది.

ఈవిషయాన్ని స్వయంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ బయట పెట్టాడు.  బుల్లితెరలో ఫేమస్ అయి ఆతరువాత వెండితెరపై కూడ అవకాశాలు దక్కించుకుని పాపులరైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ సంగతి తెలియనివారు ఉండరు. గత దశాబ్దంన్నర కాలంలో ‘సింహాద్రి’ మొదలుకుని ‘అత్తారింటికి దారేది’ వరకు చాలా సినిమాలే చేశాడు సమీర్.  
అయితే ఈనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అట.

కొంతకాలం క్రితం విడుదల అయి భయంకరమైన ఫ్లాప్ గా మారిన పవన్  సినిమా ఒకటి చూసి అతను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు అప్పట్లో దుమారం రేపింది. అప్పట్లో ఈ సంఘటన జరిగిన సందర్భంలో ఈ విషయాలను తెలుసుకున్న నాగబాబు సమీర్ ను తిట్టి పోసాడట. అయితే ఈ విషయాలను తెలుసుకున్న పవన్ నాగబాబును తిట్టమని సమీర్ కు సలహా ఇచ్చాడట. ఈ వ్యవహారంపై సమీర్ చెప్పిన ఆశక్తికర విషయాలు ఈవిధంగా ఉన్నాయి.

‘‘చాలామంది ఇండస్ట్రీ జనాల్లాగే నేను కూడా పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమానిని. అయితే అప్పట్లో భారీ అంచనాలు పెట్టుకున్న పవన్ సినిమా ఒకటి ఆ అంచనాల్ని అందుకోలేక చతికిలబడింది. నేను చాలా ఆవేదనతో ఆ సినిమా గురించి ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టాను. అది చూసి నన్ను నాగబాబు గారు తిట్టిపోశారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ నాకు ఫోన్ చేశారు. ఎవ్వరైనా ఓ సినిమాపై తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చని.. కాబట్టి నాగబాబు తిట్టడం తప్పని, కాబట్టి ఇప్పుడు ఫోన్ చేసి నాగబాబును తిట్టమని పవన్ చెప్పారు. కానీ నేనలా చేయలేదు’ అంటూ ఆనాటి సంఘటనను గుర్తుకు తెచ్చుకున్నాడు సమీర్.  

అయితే ఆ వివాదం అంతటితో సద్దుమణిగిపోయిన తరువాత తానూ పవన్ తో  ‘అత్తారింటికి దారేది’ సినిమాలోకలిసి నటిస్తున్నప్పుడు పవన్ తనను పక్కకు పిలిచి అప్పటి సంఘటనను గుర్తుకు చేస్తూ నాగ బాబును ఎందుకు తిట్టలేదు అని అడుగినప్పుడు తన మైండ్ బ్లాంక్ అయిపోయిన విషయం బయట పెట్టాడు సమీర్. ఏమైనా ఈ సంఘటన బట్టి పవన్ ఏవిషయంలో ఎంత నిజాయితీగా వ్యహరిస్తాడో తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: