ఈరోజు విడుదలైన ‘కాటమరాయుడు’ మొదటి రోజు మొదటి షోకు పాజిటివ్ టాక్ రావడంతో ఇక ఈసినిమా ఏ రేంజ్ హిట్ అన్న విషయమై అప్పుడే చర్చలు మొదలైపోయాయి. తెలుగు సినిమా రికార్డులను తిరగ వ్రాసిన ‘బాహుబలి’ మొదటిరోజు 22 కోట్ల దాటిన షేర్ ను కలక్ట్ చేసినప్పటికీ సంక్రాంతికి వచ్చిన ‘ఖైదీ నెం 150’ సినిమా అత్యధికంగా తొలిరోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 23.24 కోట్ల షేర్ వసూలు చేసింది. 

అయితే ఈరికార్డును ‘బాహుబలి 2’ బ్రేక్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఈరోజు విడుదలైన ‘కాటమరాయుడు’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతోపాటు భారీగా అడ్వాన్స్ బుకింగులు అవ్వడం అలాగే భారీ సంఖ్యలో ధియేటర్లు దొరకడంతో ‘కాటమరాయుడు’ ఖచ్చితంగా ‘ఖైదీ నెంబర్ 150’ మొదటిరోజు రికార్డును తారుమారు చేస్తుంది అన్న అంచనాలలో ఉన్నారు టాలీవుడ్ విశ్లేషకులు. 

ఇప్పటివరకు మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ‘ఖైదీ నెంబర్ 150’ తొలిరోజున 23 కోట్లు పైగా షేర్ వసూలు చేస్తే దాని వెనువెంట ‘బాహుబలి’ 22.4 కోట్లు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ 20.9 కోట్లు ‘జనతా గ్యారేజ్’ 20.4 కోట్లు ‘శ్రీమంతుడు’ 14.7 కోట్లు కలక్షన్స్ తో సినిమాలు వరస పెట్టి ఉన్నాయి. 

దీనితో ఈరోజు ఉదయం నుండి ఈమూవీకి మొదలైన పాజిటివ్ టాక్ తో ఈసినిమా కూడ కలక్షన్స్ రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం అని అంటున్నారు. అయితే ఈసినిమాను భారీ మొత్తాలకు బయ్యర్లు కొనుక్కున్న నేపధ్యంలో 85 కోట్లకు పైన ఈసినిమా కలక్షన్స్ రాబట్టగలిగితేనే ఈసినిమా బయ్యర్లు సేఫ్ అవుతారు అన్న ప్రచారం జరుగుతోంది.  

ఇది ఇలా ఉండగా ఈరోజు విడుదలైన ‘కాటమరాయుడు’ మూవీ ధియేటర్ల దగ్గర పవన్ అభిమానుల డప్పులు టపాకాయల హోరుతో మన ఇరు రాష్ట్రాలలోని ధియేటర్లు హోరేత్తిపోతున్నాయి అన్న వార్తలు వస్తున్నాయి. పవన్ అభిమానులైతే ఈమూవీకి వచ్చిన పాజిటివ్ టాక్ తో ‘మీసం మెలేసిన కాటమరాయుడు’ అంటూ ‘ఉగాది’ రాకుండానే ఉగాది పండుగను ‘కాటమరాయుడు’ ధియేటర్ల ముందు పండుగ జరుపుకుంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: