ఎవడు ఆడియో రివ్యూ

న‌టీన‌టులు- రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్, శృతిహాస‌న్ అమీ జాక్సన్, సాయికుమార్
ద‌ర్శకుడు-వంశీపైడిప‌ల్లి

మ్యూజిక్ డైరెక్టర్ -దేవిశ్రీ ప్రసాద్

పాట‌ల ర‌చ‌యితలు-కృష్ణ చైత‌న్య, సిరివెన్నెల సీతారామ‌శాస్త్రీ, చంద్రబోస్, హ‌రిరామ‌య్య జోగ‌య్య శాస్త్రీ.

గాయ‌కులు-దేవిశ్రీ ప్రసాద్, సుచిత్ సురేశ‌న్, కార్తీక్, శ్రేయ గోష‌ల్, రంజిత్, మ‌మ‌తా శ‌ర్మ, కె.కె,  డెవిడ్ సిమోన్, ఆండ్రియా, సాగ‌ర్, రెనైనా రెడ్డి.

ఎవ‌డు సాంగ్1- ఫ్రీడ‌మ్
చ‌ర‌ణ్ ప్రతి సినిమాలో సోలో సాంగ్ వుంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే.   చెర్రి ఎంట్రీలోలోనే సాంగ్ వుంటుంది కాబ‌ట్టి డాన్స్ బాగా వేసేందుకు పాస్ట్ బీట్ కంపోజ్ చేస్తారు.   అయితే ఎవడులో మాత్రం ఫ్రీడ‌మ్ సాంగ్ ని చాలా డిఫ‌రెంట్ గా కంపోజ్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. పొగ‌రు పోటీ మాదే అంటూ వ‌చ్చే ప‌దాలు ఫాస్ట్ బీట్ లో కొట్టుకుపోకుండా దేవిశ్రీ కంపోజ్ చేశాడు.  డాన్స్ తో  మీనింగ్ పుల్ సాంగ్ ఇది. కృష్ణ చైత‌న్య యూత్ ఇన్ స్పైర్ అయ్యేలా ప‌దాల‌తో పాట‌ను ప‌రుగులు పెట్టించారు.  దేవిశ్రీ ట్యూన్, కృష్ణ చైత‌న్య  వ‌ర్డ్స్    క్యాచీగా వుండ‌టంతో ప్రతి మ్యూజిక్ ల‌వ‌ర్స్ నోట ఇపుడు ఈ పాటే విన‌బ‌డుతోంది.




సాంగ్2-  నీ జ‌త‌గా .....

నీ జ‌త‌గా..ప‌దాలు చూస్తేనే అర్దమైపోయి వుంటుంది. ఇట్స్ ఎ రోమాంటిక్ సాంగ్ అని. నిజానికి   దేవిశ్రీ ప్రసాద్ అంటే మాసే కాదు మెలోడీ కూడా ఇర‌గ‌దీస్తాడ‌ని నీ జ‌త‌గా సాంగ్ ని వింటే  మ‌రోసారి అర్దమవుతుంది ఎవ‌రికైనా. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రీగారు రొమాంటిక్ సాంగ్స్ రాయ‌డంలో తిరుగులేద‌ని మ‌రోసారి ప్రూవ్ చేశారు. ముఖ్యంగా మొద‌టి  చ‌ర‌ణంలో క‌ల్లోకి వ‌స్తావ‌నుకున్నా..తెల్లారు చూస్తూ కూర్చున్నా....రాలేదేం..అని వ‌చ్చేప‌దాలు ఆయ‌న మాత్రమే రాయ‌గ‌ల‌రు. ఇక కార్తీక్, శ్రేయ గోష‌ల్ దేవిశ్రీ కంపోజ్ చేసిన ట్యూన్ కు,  సిరివెన్నెల రాసిన ప‌దాల‌ను త‌మదైన  స్టైల్లో పాడి మెస్మరైజ్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఈ ఆల్బమ్ లో  లిస్ట్ లోనే కాదు  టాప్ 2 సాంగ్ ఇదే అని చెప్పొచ్చు.

��


సాంగ్3- అయ్యో పాపం

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడంటే...ఆ సినిమాలో ఐటం సాంగ్  ఖ‌చ్చితంగా  కేక పెట్టిస్తుంద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. సేమ్ వే ఎవ‌డులోనూ అయ్యో పాపం అంటూ మాంచి బీట్ వున్న ఐటం సాంగ్ కంపోజ్ చేశారు దేవిశ్రీ. లాస్ట్ ఇయ‌ర్ గబ్బర్ సింగ్ లోని కెవ్వుకేకతో మ్యూజిక్ ల‌వ‌ర్స్ చేత కేక పెట్టించిన దేవిశ్రీ ఈ ఇయ‌ర్ మాస్ జ‌నాల చేత అయ్యో పాపం అని అరిచి విజిల్స్ వేసేలా చేశాడు. హ‌రిరామ‌య్య జోగ‌య్య శాస్త్రీ అదిరిపోయే ప‌దాల‌కు  రంజిత్, మ‌మ‌తా శ‌ర్మ త‌మ వాయిస్ తో  జీవం పోశారు. ఆడియోలోనే ఇలా వుంటే ఇక స్క్రీన్ పై ఈ పాట ఎంత‌గా ఊపేస్తుందో చూడాలి.



సాంగ్4- చెలియా చెలియా

ప్రతి ఆల్బమ్ లోనూ దేవిశ్రీ ఏదో ప్రయోగం చేసి తీర‌తారు. అందులోనూ చెర్రికి ఫ‌స్ట్ టైం మ్యూజిక్ అందిస్తున్న సినిమా కావ‌డంతో ఎవ‌డులోనూ అదే రూటులో వెళ్లి చెలియా చెలియా సాంగ్ ని కంపోజ్ చేశారు. నిజానికి ప్రియురాలు దూర‌మైన‌ప్పుడు హీరో పాడే పాట‌లు దాదాపు మెలోడిగా వుంటాయి. కానీ మ‌న్మధుడులో  ఎండింగ్ లో చెలియా చెలియా సాంగ్  కి చేసే ప్రయోగ‌మే ఎవడులోనూ చేసి మ‌రోసారి మ్యాజిక్ చేశాడు దేవిశ్రీ. చంద్రబోస్ రాసిన ఈ పాట‌ను బాలీవుడ్ సింగ‌ర్ కె.కె. త‌న దైన స్టైల్లో పాడి కేక పెట్టించాడు. ఇంకా చెప్పాలంటే ఈ ఆల్బమ్ కి ఇదే టాప్ సాంగ్



సాంగ్5- ఓయే  ఓయే

జులాయిలో దేవిశ్రీ బీట్స్ కి త‌న‌దైన ప‌దాల‌తో ఎట్రాక్ట్ చేసిన లిరిసిస్ట్  శ్రీమ‌ణి ఎవ‌డులో ఓయే ఓయే అంటూ అద‌ర‌గొట్టారు. హ‌స్కీగా సాగే ఈ పాట‌ను డేవిడ్ సిమోన్, ఆండ్రియా ఆల‌పించారు. నిజం చెప్పాలంటే ఆ ఇద్దరి వాయిస్ కాస్త మ‌త్తుగా వుంటుంది. అందుకే దేవిశ్రీ ఆ సింగర్స్ తో పాడించి ..... సంగీత ప్రియుల‌కి మ‌త్తు ఎక్కించేశారు. ఈ పాట కూడా త్వర‌గానే మ్యూజిక్ ల‌వ‌ర్స్ కి ఎక్కేస్తుంది.



సాంగ్6- పింపుల్ డింపుల్


ఆల్బమ్ లో ఆఖ‌రి పాట‌..నిన్ను చూడ‌కుంటే చాలు చెంప‌లో పింపుల్. అదిరిపోయే డ్యుయెట్ ఇది. రామ‌జోగ‌య్య శాస్త్రీ  ఈ ఆల్బమ్ లో  రాసిన ఈ రెండో పాట‌ను దేవిశ్రీ బ్రద‌ర్ సాగ‌ర్, రెనైనా రెడ్డి పాడారు. ప‌ల్లవి నుండి చ‌ర‌ణం2 వ‌ర‌కు కూడా లవ్లీగా సాగిపోతుంది పాట‌. యూత్ కి  పింపుల్ డింపుల్ పిచ్చెక్కించ‌డం ఖాయంగానే కనిపిస్తోంది.


 
ఎవడు ఆడియో విశ్లేష‌ణ‌-
ఎవ‌డు సాంగ్స్  మ్యూజిక్ ల‌వ‌ర్స్ ని ఊపేయడం ఖాయం. దేవిశ్రీ మ‌రోసారి మ్యాజిక్ చేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: