పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాట‌మ‌రాయుడు చిత్రం నేడు థియోటర్స్ ని హిట్ చేసి…సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన క్లియర్ టాక్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అలాగే థియోటర్స్ వద్ద సైతం కాట‌మ‌రాయుడు మూవీ హిట్టా?ఫట్టా? అనే టాక్స్ వినిపిస్తున్నాయి. థియోటర్స్ నుండి బయటకు వస్తున్న ప్రేక్షకులను ప్రతి ఒక్కరు కాట‌మ‌రాయుడు మూవీ గురించే అడుగుతున్నారు.


అయితే కొంత మంది కాట‌మ‌రాయుడు సూపర్ అంటుంటే…మరికొంత మంది మాత్రం కాట‌మ‌రాయుడు మూవీ యావరేజ్ అని అంటున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించి టాక్స్ ఎలా ఉన్నాయని అనే విషాయాన్ని చూస్తే….రాయ‌ల‌సీమ‌లోని తాళ్ల‌పాక గ్రామంలో కాట‌మ‌రాయుడు త‌న త‌మ్ముళ్ల‌తో ఉంటూ అరాచ‌క శ‌క్తుల‌నుండి ప్ర‌జ‌లను కాపాడుతుంటాడు. కామ‌ట‌రాయుడుకి న‌లుగురు త‌మ్ముళ్లు. పెళ్ల‌యితే తాము ఎక్క‌డ విడిపోతామో అన్న భ‌యంతో కాట‌మ‌రాయుడు అస‌లు పెళ్లి కాదు క‌దా ఆడ‌పిల్ల‌ల వంకే చూడ‌డు.


దీంతో తముళ్ళు కాటమరాయుడు ని ఏ విధంగా ప్రేమలోకి దింపుతారు…ఆ తరువాత వచ్చే పరిణామాలు కథని ఏ విధంగా మలుపు తిప్పాయనేది మూలకథ. ఇదిలా ఉంటే కాట‌మ‌రాయుడు సినిమా ప్రారంభం చాలా బాగుందని చెప్పవచ్చు. ఫస్టాఫ్ లో బోర్ కొట్టించే సన్నివేశాలు తక్కువే. రావు ర‌మేష్‌పాత్రని చాలా చక్కగా చూపించారు. న‌లుగురు త‌మ్ముళ్లు త‌మ ప్రేమ కోసం అన్న‌ను శృతితో ల‌వ్‌లో ప‌డేస్తారు. ఇందుకోసం త‌మ్ముళ్లు పడిన పాట్లని చూపించిన విధానం బాగుంది. ఇక సెకండాఫ్ లో కొన్ని వీక్ సీన్స్ ని ప్రేక్షకులు కనిపెట్టేస్తున్నారు.


శృతిహాసన్ కి త‌న గురించి త‌ప్పుగా చెప్పి. తనని ల‌వ్‌లో ప‌డేసేలా చేశారన్న విషయం తెలుసుకున్న ప‌వ‌న్…తమ్ముళ్లను బెల్టుతో కొట్టే సీన్ కాస్త వీక్ గానే ఉందని అంటున్నారు. రావూ ర‌మేష్ విల‌నిజంని ఇంకాస్త ఎక్కువగా చేసి చూసిస్తే బాగుంటుందని అంటున్నారు. మొత్తంగా సినిమాని చూస్తే….ఈ మూవీ ప్రేక్సకులను బాగానే అలరిస్తుందని చెప్పవచ్చు. ఓవరాల్ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని అంటున్నారు. ప్రేక్షకులు సైతం కాట‌మ‌రాయుడు చిత్రంలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ని ఎంజాయ్ చేసే విధంగా ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: