నేడు స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం థియోటర్స్ లో రిలీజ్ అయింది. ఇదిలా ఉంటే‘కాటమరాయుడు’ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ థియోటర్‌ లో ‘కాటమరాయుడు’ మూవీ టికెట్స్ ని భారీ ధరకు అమ్ముతున్నారు. ఎక్కువ ధర అంటే ఒక్కోటికెట్ 1000, 2000 రూపాయలు కాదు. దాదాపు 5000 రూపాయలకి ‘కాటమరాయుడు’ టికెట్ ని అమ్ముతున్నారు.


ఇలా రెండు షోలకి సంబంధించిన పూర్తి టికెట్స్ ని అమ్మటం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నా పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ సినిమా నేడు రిలీజ్ అయింది.  అయితే ఈ మూవీ రిలీజ్ రోజు పలు థియోటర్స్ లో టికెట్ ధరలు పెంచారు. మొదటి మూడు రోజుల్లోనే‘కాటమరాయుడు’ సినిమా 40 కోట్లను కొల్లగొట్టాలనే ప్లాన్ తో థియోటర్స్ అన్నీ కుమ్మక్కుఅయ్యి..టికెట్స్ ధరని పెంచేశాయి.


అయితే ఈ విషయంలో కొంత మంది అభ్యంతరాన్ని వ్యక్తం చేసినప్పటికీ…‘కాటమరాయుడు’ రిలీజ్ అయిన ఆ రచ్ఛని పక్కన పెట్టి సినిమాని చూడటానికి రెడీ అయ్యారు. కొన్ని ఏరియాల్లో 10 రూపాయల టికెట్టు ధరను 50 రూపాయలు, 100 రూపాయలు చేయగా,…మిగతా టికెట్ల రేంజ్ ని 300,500,800 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఇది మొదటి రోజు సినిమా టికెట్ రేట్లు.


ఇదిలా ఉంటే తూర్పుగోదావరిలో జిల్లాల్లోని ఓ థియోటర్ లో మాత్రం మొదటి రోజు మొదటి రెండు ఆటలకి అన్ని టికెట్స్ ధర 5000 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఎవరైతే ముందుకుగా షోని బుక్ చేసుకున్నారో…వారికి మాత్రమే స్పెషల్ గా ప్రదర్శించారు. ఈ న్యూస్ తెలుసుకున్న సామాన్య ప్రేక్షకులు…5000 రూపాయలతో టికెట్స్ కొని సినిమా చూస్తున్న వారి ఆసక్తికి ముగ్ధులవుతున్నారు. మొత్తంగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘కాటమరాయుడు’ హంగామా పండుగ వాతావారణాన్ని కలిగిస్తుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: