ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో థియోటర్స్ వద్ద హల్ చల్ చేస్తున్న మూవీ కాటమరాయుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి…సినిమా ప్రేక్షకులకు  ఓ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటికే అన్ని థియేటర్లలోనూ కాటమరాయుడు ని చూటానికి ప్రేక్షకులు తరలివస్తున్నారు. దాదాపు అన్ని థియోటర్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కనిపిస్తున్నాయి.


ఆన్ లైన్ లో టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ కి భారీ స్పంధన వచ్చింది. ప్రతి ఒక్కరు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా టికెట్స్ ని బుక్ చేసుకోవటంతో దాదాపు మూడు రోజుల పాటు అన్ లైన్ లో టిక్స్ ట్స్ దొరకటం కష్టంగా ఉంది. ఇప్పటికే సాధారణ థియేటర్లలో మొదటి రెండు రోజు అన్ని షోల టికెట్లు పూర్తైపోయాయి. దీని కారణంగా కాటమరాయుడు  మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.


ఇక కాటమరాయుడు సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో రిలీజ్ అయింది. ఒక్క ఓవర్సీస్లోనే 230 కు పైగా థియేటర్లలో సినిమాను ప్రదర్శించనున్నారు. సిటీల్లోనూ కాటమరాయుడు సినిమాని భారీ సంఖ్యలో రిలీజ్ చేశారు. మొత్తంగా కాటమరాయుడు సినిమా రిలీజ్ స్ట్రాటజీని చూస్తే…కేవలం మూడు రోజుల్లో లాభాల బాట పట్టేయాలన్నదే వారి ప్లాన్ అని తెలుస్తుంది. ప్రస్తుతం థియోటర్స్ వద్ద చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడంతో అందరూ కాటమరాయుడు మూవీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.


ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు కావడం,ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో కాటమరాయుడు చిత్రానికి కలెక్షన్స్ పెంచే అంశాలుగా ఉన్నాయి. ఇక మొదటి రోజు షోలు ఇప్పటి వరకూ 100 శాతం ఆక్యుపెన్సీని చూపించాయి. దీంతో ఇండస్ట్రీలో ట్రేడ్ పండిట్స్ నుండి వినిపిస్తున్న లెక్కల ప్రకారం…ఈ మూవీకి మొదటిరోజు కలెక్షన్లు దాదాపు 21 కోట్ల రూపాయలు ఉండవచ్చు అని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: