పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ ల మధ్య ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా వచ్చిన తరువాత వారిద్దరి మధ్య దూరం పెరిగింది అన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒకటి రెండు సందర్భాలలో పూరి పవన్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసిన సందర్భాలు కూడ ఉన్నాయి. అయితే ఆ తరువాత వీరిద్దరి మధ్య విభేదాల పై పెద్దగా వార్తలు వచ్చిన సందర్భాలు లేవు. 

ఈ పరిస్థుతులలో పవన్ ‘కాటమరాయుడు’ మూవీని లెక్క చేయకుండా పూరిజగన్నాథ్ ఒక కొత్త హీరోతో తీసిన ‘రోగ్’ సినిమాను ఉగాది రోజున విడుదల చేయబోతు ఉండటం అందరికీ షాక్ ఇస్తోంది. సునామీలా దూసుకు వచ్చిన ‘కాటమరాయుడు’ సినిమాకు ఈమూవీ రిలీజ్ అయిన  తరువాత రెండు వారాల వరకు పెద్దగా ఏపోటీ ఉండదని అందరు భావించారు. అయితే అనూహ్యంగా మార్చి 31న విడుదల కావాల్సిన పూరి జగన్నాథ్‌ 'రోగ్‌'ని రెండు రోజులు ముందుకి జరిపి ‘ఉగాది’ కే రిలీజ్‌ చేస్తున్నారు. 

ఏప్రియల్ ఫస్ట్‌ వీక్‌లో పబ్లిక్‌ హాలిడేస్ ఉపయోగించుకునే విధంగా ఏప్రిల్‌ మొదటి వారంలో విడుదలవుతుందని అనుకున్న వెంకటేష్‌ 'గురు' ని కూడా మార్చి 31కి విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. సామాన్యంగా ఒక టాప్ హీరో సినిమా విడుదల అయిన తరువాత కనీసం రెండు వారాలు డిస్టెన్స్‌ మెయింటైన్‌ చేస్తూ ఉంటారు. 

అయితే అందరి ఊహలను తలక్రిందులు చేస్తూ ‘కాటమరాయుడు’ ని లెక్క చేయకుండా పూరి జగన్నాథ్ ఒక చిన్న హీరోని నమ్ముకుని దూసుకు రావడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. దీనితో పవన్ కు అటు పూరి ఇటు హీరో వెంకటేష్ ల మధ్య గట్టి పోటీ ఉండేలాగే కనిపిస్తోంది. అయితే ఈరోజు ‘కాటమరాయుడు’ కు వచ్చిన పాజిటివ్ టాక్ ఎంత వరకు నిలబడుతుందో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: