pavan kalyan images కోసం చిత్ర ఫలితం


పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్న సమయములో ఆయన వ్యక్తిత్వం పై అనేక ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి. రాజకీయాలోకి రానంతవరకు ఎవరి జీవతం వారిదే. ఒక్కసారి  రాజకీయాల్లోకి వచ్చాక ప్రజలకు నాయకుని వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే హక్కు లభిస్తుంది అని మహాకవి "శ్రీ శ్రీ" ఏనాడో చెప్పాడు.


పవన్ చాలా సందేహాలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. అందులో ఆయన చేసుకున్న పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు. ఇవి ఆయన జీవన శైలిని ప్రశ్నార్ధకం చేస్తాయి. అలాగే ఆయన గతములో  “కామన్-మాన్ ప్రొటక్షన్ ఫోర్స్” అంటూ ఒక సేవా సంస్థ ను ప్రారంభించారు. దానిద్వారా ఆయన గారు అందిస్తున్న సేవలేమిటో ప్రజలకు తెలియజేయటం లేదు. 'ఆదిలోనే హంస పాదు'లా అది వివాదాస్పదమైంది. ఒక సేవాసంస్థనే నడపలేని పవన్ ప్రభుత్వాన్నెలా నడపగలడు. 


common man protection force కోసం చిత్ర ఫలితం

కోట్లాది జనులు అభిమానించే ఆరాధ్యనటుడు నటుడు పవర్-స్టార్ పవన్ కల్యాణ్. మంచికి, పరోపకారానికి మారుపేరుగా పవన్ ను చెప్పుకుంటారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయాల్లోకి వచ్చిన లీడర్ గా పవన్ ను ఆదరిస్తారు. ఇదీ పవన్ పట్ల ప్రజల్లోకాదు ఆయన అభిమానుల్లో ఉన్న అభిప్రాయం. అలాంటి పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి బాలీవుడ్ వివాదాస్పద నటుడు, సినీ విమర్శకుడు 'కమాల్ రషీద్ ఖాన్' అత్యంత వివాదాస్పద  సంచలన వ్యాఖ్యలు చేశాడు.


పవన్ ఓ పెద్ద ఫ్లాప్ హీరో అని కమాల్ అన్నాడు. అంతేకాదు, "అతను ఓ పెద్ద మోసగాడు కూడా" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సిని డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారని, డిస్ట్రిబ్యూటర్ దిలీప్ టాండన్ను పవన్ కల్యాణ్ రూ. 8 కోట్ల మేర మోసం చేశాడని కమాల్ ఆరోపించాడు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో సర్దార్ గబ్బర్ సింగ్ వల్ల రూ. 2 కోట్లు నష్టపోయిన ఒక పంపిణీదారుడు (డిస్ట్రిబ్యూటర్) గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడంటూ, కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ ఫొటోను ట్విట్టర్ లో అప్ లోడ్ చేశాడు. ఇంత జరుగుతున్నా పవన్ ఎందుకు స్పందించడం లేదని కమాల్ ప్రశ్నించాడు. పవన్ ను ఉద్దేశించి కమాల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


pawan in prajarajyam కోసం చిత్ర ఫలితం


కాగా పవన్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' బాక్సాఫీస్ వద్ద ధారుణంగా బోల్తా కొట్టింది. దీంతో పలువురు పంపిణీదారులు భారీ నష్టాలను మూటగట్టు కున్నారు. ఇదే అంశంపై పలువురు డిస్ట్రిబ్యూటర్లు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ సంపత్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. పవన్ చుట్టూ మాఫియా ఉందని, నిర్మాత శరత్ మరార్, పవన్ పీఏలపై ఆయన ఆరోపణలు చేశారు.


కాటమరాయుడు సినిమా పంపిణీ హక్కులు తనకే ఇస్తానని చెప్పి, మోసం చేశారని సంపత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. పవన్ ను తనకు న్యాయం చేయాలని అతడు మొరపెట్టు కున్నాడు. చివరకు న్యాయం జరక్కపోవడంతో నిరాహార దీక్షకు దిగాడు. మరి ఈ వ్యవహారం ఇంకా ఎంతదూరం వెళుతుందో చూడాలి. ఇప్పటికైనా పవన్ స్పందించి ఈ వివాదానికి తెరదించుతారో లేదో చూడాలి.


pawan in prajarajyam కోసం చిత్ర ఫలితం


అంతే కాదు ప్రజాసేవ చేయటానికి రాజకీయాల్లోకి వస్తానని వాటిని సమూల ప్రక్షాళన చేస్తానని చెప్పే పవన్ తన సినిమాల విడుదలకు ముందు వసూళ్ళ కోసం చేసే విన్యాసాలు ఆయన వ్యక్తిత్వాన్ని పలుచన చేస్తున్నాయి. బెనిఫిట్ షోల పేరిట ఆయన దోచుకునేది ఆయన అభిమానులనే. టిక్కెట్ ధరలు భయంకరంగా పెంచేసి ఒక శ్రామికుని కొన్ని రోజుల సంపాదన ను ఒక్క సినిమా టికెట్ తో దోచేసే మన పవర్ స్టార్ ప్రజలకు చేసే సేవేమిటో అర్ధమౌతుంది. "ఆల్ ఇండియా మూవీ గోయర్స్ అసోసియేషన్" ఈ విషయాన్ని న్యాయస్తానాల్లో చాలెంజ్ చేశారు కూడా.

 

"మీ రికార్డుల సాధనకు, అభిమానుల్లో ఉన్న పిచ్చిని క్యాష్ చేసుకోవడానికి ఇంత కక్కుర్తి పడతారా?"  అంటూ కాటమరాయుడు చిత్ర నిర్మాణ సంస్థపై "ఆల్ ఇండియా మూవీ గోయర్స్ అసోసియేషన్" మండిపడింది. పవన్ కల్యాణ్ సినిమా అంటే జనాల్లో ఉన్న క్రేజ్ని సొమ్ము చేసుకోవాలని కాటమరాయుడు సినిమా టిక్కెట్ల ధరను ధారుణంగా  పెంచడాన్ని అసోసియేషన్ తీవ్రంగా నిరసించింది.


pavan in prajarajyam కోసం చిత్ర ఫలితం


అందరూ చేస్తూనే ఉన్నారుగా?  అంటే పవన్ కల్యాణ్ అందరితో సమానమే అనికదా! అలాంటప్పుడు ఆయన నాయకుడు ఎలా ఔతాడు. గతములో తన అగ్రజుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ఒక భయానక రాజకీయ వైఫల్యం. దానిలో పవన్ కల్యాన్ యువరాజ్యం అధినేతగా ఉండి ప్రజలకు ఆయనేమి చేశారనేది కూడా ప్రశ్నించవలసిన అవసరముంది.  దానికి ఆయన తప్పు తన అన్న మీద తోసేసినా ఎవరూ అంగీకరించరు. ఎందుకంటే ఆ తప్పును ఏనాడూ పవన్ తన అన్నను బహిరంగంగా ప్రశ్నించిన సంధర్భమే లేదు. ఏవరో సంభాషణల రచయిత రాసిన దాన్ని సభల్లో మాట్లాడి  అప్పుడప్పుడు మెరుపు వీరుళ్ళా కనిపించి  మాయమయ్యే వ్యక్తి ప్రజలకు చేయబోయె సేవలెప్పుడూ ప్రశ్నార్ధకమౌతాయి.


కోటానుకోట్ల ప్రజానీకానికి  "మోడీ-బాబు"  తరపున హామీగా నిలబడి వారితో పనిచేయిస్తానని, చేయకపోతే ప్రశ్నిస్తానని ప్రశ్నించ టానికే  ప్రజారాజ్యం పుట్టిందని చెప్పిన పవర్ స్టార్లోని ప్రతిభ అభిమానులకు నచ్చవచ్చేమోగా ప్రజలకు ఆమోదయోగ్యం కానే కాదు.


pavan in prajarajyam కోసం చిత్ర ఫలితం


అంతెందుకు నిన్న 24మార్చ్ నాడు విడుదలైన కాటమరాయుని దెబ్బకు పదుల సంఖ్యలో చిన్న సినిమాలను థియేటర్ల నుండి తీసేశారు. ఈయన "ఒక్కడి కోసం ఒక వ్యవస్థే బలవ్వటం"  మనం గమనించాము కదా! స్వార్ధపరత్వానికి పవన్ కళ్యాన్ పరాకాస్ట అనేదానికి ఇది ఉదాహరణ కాదా?  పోనీ ఒక మహానటుడి నీడలో ఎదిగిన ఈయన చేసిన సినిమాలెన్ని?  అందులో హిట్స్ ఎన్ని? ఫట్స్ ఎన్ని?


1996లో  'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'  తో సినీరంగ ప్రవేశం చేసిన పవన్ ఈ ఇరవై సంవత్సరాల సినీజీవితములో చేసిన సినిమాలు 25కు మించవు. అందులో నూ  వైఫల్యాలే ఎక్కువ. అంతటా "సోమరితనం"  మాత్రమే  కనపడుతుంది. ఎందుకంటే సంవత్సరానికి ఒక్క సినిమా మాత్రమే చేసిన ఘనత ఈ యువకునిది. బహుశ 4 లేదా 5 హిట్స్, సూపర్-హిర్స్, సోకాల్డ్ ఇండస్ట్రి హిట్స్ ఉంటాయి.


"దురభిమానుల అభిమానానికి ఆకృతి పవన్ కళ్యాన్"  అంతకుమించి ఏమీలేదు. ఇలాంటి పవన్ ప్రజలకు మేలు చేస్తాడని ఆశిస్తే అంతకంటే దురాశ ఉండదేమో!  జనసేనలో యువసేన నాయకుడుగా ఉండి ఆయన ప్రజలకు చేసిన న్యాయం ఏముంది? "మోడీ-బాబు-పవన్" కాంబినేషన్ ప్రజలను ముంచింది. విభజన ఫలాలను పవన్ వారి నుండి ప్రజలకు సాధించి పెట్టలేదు.  వీటికి కారణం వారిద్దరే నేను కాదంటే,  భాధ్యత తీసుకున్న పవన్ కు, బాధ్యత పుర్తిచేయాల్సిన అవసరం లేదా? అ నమ్మకంతో వారిపక్షాన వకాల్తా తీసుకున్నాడు అనేదే అసలు సమస్య?  అందులో భాధ్యత లేదా! భాధ్యత నుండి తప్పుకునే వాళ్ళు భవిష్యత్తులో అధికారములోకి వచ్చి ప్రజలకు చేసేదేముంది? పోనీ వ్యక్తిగత జీవితములో ప్రధానంగా విడాకుల పర్వాలే కనిపిస్థాయి. ఇలాంటి వాళ్ళు ప్రయాణీంచే పడవను, నట్టనడి సంద్రం లో ముంచేస్తారు తప్ప చేసేవేమీ లేవు.


వీళ్ళు నటులుగా ఉంటేనే అభిమానులకు వినోదం కోరే మనలాంటి వాళ్ళకు మేలు జరుగుతుంది. అలాగాక రాజకీయాల్లోకి వస్తే నందమూరి తారక రామారావులా లక్ష్మి పార్వతులు, ఎం.జి.ఆర్ లా జయలలితలు, జయలలిత వారసురాలిగా శశికళలు పనీర్-సెల్వం లు కుక్కగొడుగుల్లా పుట్టుకొచ్చి ప్రజలకు వదిలించుకోలేని  బ్యాగేజులు  తయారౌతాయి తప్ప ప్రజలకు మేలేమీ జరగదు.     


వీళ్ళ చుట్టూ తయారయ్యే వీరి అభిమాన గణాల "కోటరీ"లే మనలని శాసిస్తాయి. వీళ్ళ సినిమాలను చుద్ధాం. అంతే కాని వీళ్ళ పాలన మనకవసరమా! "జయలలిత తమిళ ప్రజలకు సమర్పించిన శశికళ లాంటి మన్నార్గుడి మాఫియా" లాంటి నాయకత్వాలు అవసరమా? 





common man peotection force కోసం చిత్ర ఫలితం


కాటమరాయుడు జస్ట్ ఒక సాధారణ సినిమా! అభిమానులు తెచ్చిన హైపుతో వచ్చిన తిమ్మిరి వదిలితే - వసూళ్ళు సాధారణ సినిమాల మాదిరే. ఇక్కడ పవన్ కు ఆ సినిమా టీముకు కావలసింది రికార్డుల మోత. కలక్షన్లు మాత్రమే సందేశం తొక్కా ఎమీ లేది ఇందులో. సరిగ్గా రేటింగ్ ఇస్తే 3/5 వస్తుంది అదీ అతి కష్టం మీద. పవన్ కళ్యాణ్ కున్న ఇమేజ్ తోడైతే ఈ చిన్న రేటింగే కలక్షన్ల వర్షం కురుస్తుంది. డాబు చేతికి వచ్చాక వాతావరణం మాములైపోతుంది. జష్ట్ పక్తు వ్యాపారమే.  


pawan cheguvera కోసం చిత్ర ఫలితం

పవన్ పదేపదే రొద పెట్టే ఫెదెల్ కాస్ట్రో లాంటి నాయకునికే ఆదర్శంగా నిలిచిన చెగువేరా లాంటి త్యాగధనుణ్ణి ఈయన నుంచి ఊహించగలమా?

మరింత సమాచారం తెలుసుకోండి: