టాలీవుడ్ లో స్టార్ లెగసీ ఉన్న ఫ్యామిలీలో అక్కినేని కుటుంబం కూడా ఒకటి. ఏయన్నార్ నుండి నిన్న ఎంట్రీ ఇచ్చిన అఖిల్ వరకు ఆ క్రేజ్ వేరేలా ఉంటుంది. అక్కినేని నాగేశ్వర రావు తర్వాత నాగార్జున ఆ స్టార్ లెగసీని కాపాడుకుంటూ వచ్చాడు ఆ తర్వాత అదే కుటుంబం నుండి సుమంత్, సుశాంత్, నాగ చైతన్య, అఖిల్ ఇలా అందరు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.


నాగ్ తర్వాత నాగ చైతన్య క్లిక్ అయ్యాడు.. సుమంత్, సుశాంత్ లు హిట్ కోసం నానా కష్టాలు పడుతున్నారు. ఇక అఖిల్ చేసిన మొదటి సినిమా ఫ్లాప్ అయినా అతనిలోనే గ్రేస్ అందరికి నచ్చేసింది. సుమంత్ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ నాగార్జున సోదరి నాగ సుశీల తనయుడు. కాళిదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ హీరోగా నిలబడటానికి కష్టాలు పడుతున్నాడు.


సుశాంత్ కాస్ట్ మూవీ ఆటాకుందాం రా.. జి.నాగేశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాగ చైతన్య, అఖిల్ లు గెస్ట్ రోల్స్ చేశారు. చైతు జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్లగా అఖిల్ ఓ పాటలో కనిపించి అదరగొట్టాడు. ఇక సినిమాలో ఈ ఇద్దరు ఉన్నది కొద్దిసేపే అయితే దర్శక నిర్మాతలు ఆ హీరోలతో ఓ పోస్టర్ రిలీజ్ చేశారట. అక్కడ మొదలైంది రగడ.. చైతన్య, అఖిల్ ల మధ్యలో సుశాంత్ చిన్నగా కనిపించాడట. హీరో తానా లేక వారిద్దరా అన్న డౌట్ తో నిర్మాతలను కడిగేశాడట.


అంతేకాదు ఆ నిర్మాతతో తమ ఫ్యామిలీకున్న బిజినెస్ డీలింగ్స్ కూడా అన్ని క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్నాడట. సుశాంత్ కోపం తనని తక్కువ చేశారనా లేక అక్కినేని వారసుల ముందు తన చిన్నబోయాననా అన్నది తెలియలేదు కాని అక్కినేని కాంపౌండ్ లో ఈ కొత్త రగడ అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: