పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటించిన లేటెస్ట్ మూవీ 'కాటమరాయుడు'. ఈ మూవీ ప్రంపచవ్యాప్తంగా నిన్న థియోటర్స్ లో రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని తెలుగు అభిమానులు, విదేశాలలో ఉన్న పవన్ ఫ్యాన్స్ కు ఈ మూవీ తెగ సంతోషాన్ని ఇస్తుంది. 'కాటమరాయుడు' మూవీలో పవన్ కళ్యాణ్ పక్కా మాస్ లుక్ లో కనిపించి అలరించారు.
ముఖ్యంగా టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి అభిమానులు ఎక్కువుగా ఉన్నారు కాబట్టి…ఈ మూవీపై పాజిటివ్ టాక్స్ ని తీసుకువచ్చారు. దీంతో 'కాటమరాయుడు' చిత్రం యావరేజ్‌ అని రివ్యూలు అంటున్నప్పటికీ…థియోటర్స్ కి మాత్రం ప్రేక్షకులు తరలివస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే 'కాటమరాయుడు' రిలీజ్ అయిన రోజు సినిమాని చూడాటానికి చాలా మంది ప్రయత్నించారు.

ఇందులో చాలా మందికి టికెట్స్ దొరకలేదు. కానీ సాయంత్రానికి ఆ మూవీ యూ ట్యూబ్ లో ప్రత్యక్షం అయింది. 'కాటమరాయుడు' మూవీని ముక్కులు ముక్కులుగా చేసి…యూ ట్యూబ్ లో దాదాపు గంటకు పైగా చిత్రాన్ని ఉంచారు. సాయంత్రం సమయంలో పలు ఐడిల నుండి 'కాటమరాయుడు' మూవీ యూ ట్యూబ్ లో దర్శనం ఇవ్వటం ఒక్కసారిగా షాక్ ని ఇచ్చింది. థియోటర్ లో ప్రదర్శన జరుగుతున్న సమయంలో ప్రేక్షకులు ఈ వీడియోని తీసినట్టుగా స్పష్టంగా తెలుస్తుందని చూసిన వారు అంటున్నారు.

అయితే చిత్ర యూనిట్ అలర్ట్ అయి…యూ ట్యూబ్ లో ఉన్న 'కాటమరాయుడు' వీడియో క్లిప్పింగ్స్ ని పైరసీ టీంతో మాట్లాడి తీయించివేసినట్టుగా తెలుస్తుంది. ఇక అత్తారింటికి దారేది తర్వాత అంతటి హిట్ ని అందుకున్న మూవీగా 'కాటమరాయుడు' మూవీని అంటున్నారు. ఫ్యాన్స్ కి ఈ మూవీ బాగా నచ్ఛటంతో 'కాటమరాయుడు' మూవీకి ఫ్యాన్స్ రిపీటెడ్ గా వెళుతున్నారు. గత చిత్రాలకు భిన్నంగా 'కాటమరాయుడు' లో పంచెకట్టుతో పవన్ కనిపించడమే ప్రేక్షకులను ఆకట్టుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: