టాప్ హీరోలు అందర్నీ టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసే వర్మకు చిరంజీవి పవన్ లు అంటే ప్రత్యేక అభిమానం. ఈ అభిమానంతో ఏమాత్రం అవకాశం వచ్చినా పవన్ చిరంజీవిల పై తన దురుసైన కామెంట్స్ తో టార్గెట్ చేస్తూ ఎప్పుడు సంచలనాలకు చిరునామాగా ఉంటాడు రామ్ గోపాల వర్మ. 

ఈ పరిస్థుతుల నేపధ్యంలో నిన్న విడుదలైన ‘కాటమరాయుడు’ సినిమాను టార్గెట్ చేస్తూ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. ‘కాటమరాయుడు’ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ‘అవతార్’, ‘బాహుబలి 2’ ట్రైలర్ కంటే బాగుంది ఇంకా ‘బాహుబలి2’ విడుదల కాలేదు కాబట్టి మరో 100 మిలియన్ల వ్యూస్‌ను చూస్తాను’ అని వర్మ ట్వీట్ చేశాడు. 

అంతేకాదు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ భ్రమలలో బతుకుతున్నారు. వారి అంధకారమే వారి నేతలు వాస్తవాన్ని గ్రహించలేని గుడ్డివాళ్లను చేస్తున్నది అంటూ మరో ట్వీట్ తో సెటైర్ వేశాడు. అంతేకాదు తాను సినిమారంగంలోని టాప్ హీరోలకు సలహాలు ఇచ్చే స్థాయిలో లేకపోయినా కనీసం ‘బాహుబలి’ లాంటి సినిమాలను చూసి కూడా మన టాప్ హీరోలు ఎందుకు మారడం లేదో తనకు అర్ధం కావడం లేదు అంటూ మరో వ్యంగాస్త్రం ప్రయోగించాడు వర్మ. 

‘కాటమరాయుడు’ చూడటం కంటే పోర్న్ సినిమా చూడటం మేలని ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కంటే ‘కాటమరాయుడు’ బెటర్ సినిమానో కాదో తనకు తెలియదని వర్మ సెటైర్లు చూసిన వారికి మాత్రం ‘కాటమరాయుడు’ పై వర్మ ఎంత పగను పెంచుకున్నాడో అర్ధం అవుతోంది. అయితే వర్మ చేసిన ఈ బహిరంగ కామెంట్స్ పై పవన్ అభిమానులు తమ తీవ్ర అసంతృప్తి వ్యక్త పరచడమే కాకుండా వర్మను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడ పెడుతున్నారు. 

అయితే వివాదాలకు విమర్శలకు ఎప్పుడూ ముందు వరసలో ఉండే వర్మ ఏవిధంగా మారడో సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసే పవన్ కూడ మారడు. అందువల్ల వర్మ లాంటి వ్యక్తులు ఎలాంటి కామెంట్స్ చేసినా పవన్ ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకా ‘కాటమరాయుడు’ లాంటి సినిమాలు ముందుముందు మరిన్ని చేసినా ఆశ్చర్యం లేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: