పవన్ కళ్యాణ్ “కాటమరాయుడు” సినిమా విడుదలై  ఒక రోజు  పూర్తి అయి రెండవరోజులోకి అడుగుపెట్టి సగం రోజుకు పైగా పూర్తి  అయింది. ఇక ఓవర్సీస్ లో అయితే ముందురోజు ప్రదర్శించిన ప్రీమియర్ షోలతో లెక్కలు వేస్తే  ఈసినిమా ఓవర్సీస్ లో విడుదలై రెండు రోజులు పూర్తి అయినట్లు అవుతుంది. 

ఈ నేపధ్యంలో ఎంతో హంగామా జరిగిన ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ? అన్న ఆశక్తి అటు పవన్ అభిమానుల్లోనూ ఇటు ట్రేడ్ వర్గాలలోను బాగా పెరిగి పోయినా  ఈ సినిమా కలెక్షన్స్ కు  సంబంధించి ఎటువంటి ప్రకటనా ఈసినిమా నిర్మాతల నుండి ఇప్పటి వరకు విడుదల కాకపోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ఏపీ, తెలంగాణాలతో పాటు దేశవ్యాప్తంగా వసూళ్ళ గురించి ఇటీవల కాలంలో అఫిషియల్ గా చాల సినిమాలు ప్రకటించకపోయినా ఓవర్సీస్ లో కలక్షన్స్ మాత్రం అధికారికంగా చాలామంది ప్రకటిస్తున్నారు. 

సంక్రాంతికి రిలీజ్ అయిన ‘ఖైదీ నెంబర్ 150’ గురించి ఆసినిమా నిర్మాతలు తరుచూ మీడియాకు లీకులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికితోడు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్, ఎప్పటికప్పుడు సినిమాల కలక్షన్స్ వివరాలు తరుచూ ప్రకటిస్తూ ఉండటం అందరికీ తెలిసిన విషయమే. 

అయితే తరుణ్ ఆదర్ష్ కూడ ‘కాటమరాయుడు’ సినిమా కలక్షన్స్ గురించి మౌనముద్ర వహిస్తున్నాడు. దీనితో నిన్న ఎన్నో భారీ అంచనాలతో విడుదలైన ‘కాటమరాయుడు’ కలక్షన్స్ పరిస్థితి ఏమిటి అన్న విషయమై రకరకాల భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఫిలింనగర్ లోని ఒక వర్గం అయితే ‘కాటమరాయుడు’ ప్రీమియర్ షోల కలక్షన్స్ 6.50 లక్షల డాలర్స్ గా పేర్కొంటున్నారు, అలాగే ప్రపంచ వ్యాప్తంగా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ 24 కోట్ల షేర్ ను వసూలు చేసినట్లుగా ఫిలింనగర్ లో పవన్ అనుకూల వర్గం ప్రచారం చేస్తోంది. ఈవార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా హడావిడి చేస్తున్న ఈ కలక్షన్స్ ఫిగర్స్ ను చూసి పవన్ ఫ్యాన్స్ మటుకు సంబరాలు చేసుకుంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: