ప్రస్తుతం టాలీవుడ్ లో ‘కాటమరాయుడు’ సినిమా హల్ చల్ చేస్తుంది. ఏ థియోటర్ లో చూసిన ‘కాటమరాయుడు’ సినిమా తప్పితే మరో సినిమా కనిపించటం లేదు. ఇక ‘కాటమరాయుడు’ మూవీకి సంబంధించిన హిట్ టాక్ ఇప్పటికే బయటకు వచ్చింది. అలాగే ఈ మూవీని చూడటానికి ప్రేక్షకులు థియోటర్స్ కి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సినిమాని చూసిన ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ సినిమాని చూడాలని థియోటర్స్ కి రావటంతో మూవీకి రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారని చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే ‘కాటమరాయుడు’ మూవీ కొన్ని ఏరియాల్లో కలెక్షన్స్ దుమ్మురేపుతుంది. ముఖ్యంగా నైజాం, కృష్ణ,వైజాగ్, గోదావరి జిల్లాల్లో సినిమా అభిమానులు విపరీతంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైందంటే ఓపెనింగ్ డే  కలెక్షన్స్ అధిరిపోతాయి. అలాగే వారం రోజుల పాటు ఈ ఏరియాల్లో కలెక్షన్స్ వరదలు పెడుతుంటాయి.

నిజానికి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమా సాధారణంగా ఉందంటేనే కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. అలాంటిది ‘కాటమరాయుడు’ బాగుంది అనే టాక్స్ రావటంతో ఈ మూవీకి కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. అభిమానులు ‘కాటమరాయుడు’ విషయంలో ఎంతగ ఆసక్తిగా ఎదురుచూశారు అనే విషయం….‘కాటమరాయుడు’ కలెక్షన్స్ ని చూస్తుంటే అర్ధం అవుతుంది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో తొలి రెండు రోజుల కలెక్షన్స్ అధిరిపోయాయి.

ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఈచిత్రం 5.6 కోట్లు అలాగే రూ 5 కోట్ల షేర్ ని సాధించడం విశేషంగా మారింది. ఆ ఏరియాల్లో ఇది రికార్డ్ కలెక్షన్స్ అని చెప్పవచ్చు. డాలి దర్శకత్వం వచించిన ఈ చిత్రం లో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మొత్తంగా ‘కాటమరాయుడు’ సినిమాలకి అన్ని ఏరియాల నుండి అధిరే కలెక్షన్స్ రావటంతో ఈ మూవీ కమర్షియల్ హిట్ ని సాధించిందని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: